Drinking alcohol : పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్’ అన్నాడు మన పాతకాలపు గిరీషం.. కానీ నేడు ‘అసలు మద్యం తాగనివాడు మనిషే కాదంటున్నాడు’ ఆధునిక గిరీషం. ఈకాలంలో ఆడ, మగ అనే తేడా లేకుందా మద్యం తాగడం ఒక అలవాటుగా మారిపోయింది. పని ఒత్తిడి వల్లనో.. సరదా కోసమో కొందరు రోజూ మద్యం తీసుకుంటారు. అయితే కొందరు మోతాదుకు మించి మద్యం సేవిస్తారు. ఇలా అతిగా మద్యం తీసుకోవడడం వల్ల హ్యాంగోవర్ ఏర్పడుతుంది. రాత్రి మద్యం తాగేటప్పుడు ఉన్న సంతోషమంతా.. ఉదయం లేవగానే ఆవిరైపోతుంది. శరీరం నుంచి ఏదో మిస్సయినట్లుగా.. తీవ్ర తలనొప్పితో హ్యాంగోవర్ ఏర్పడుతుంది. హ్యాంగోవర్ బాధ చాలా మంది మద్యం ప్రియులకు తెలుసు. అయినా రాత్రయ్యే సరికి మళ్లీ మద్యాన్ని ముట్టుకోక మానరు. అయితే కొందరు హ్యాంగోవర్ నుంచి తప్పంచుకునేందుకు ప్రత్యేకంగా ట్యాబ్లెట్లను తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం మంచిదేనా..? తీసుకుంటే ఏమవుతుంది..?
మానసిక ఉల్లాసానికి మద్యం తీసుకుంటున్నామని చెబుతున్న కొందరు మోతాదుకు మించి సేవిస్తున్నారు. దీనివల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ప్రతీ చోటా మద్యం హానికరం అని చెబుతున్నా.. ఆ ప్రకటనలు ఏమాత్రం పనిచేయడం లేదు. అయితే మానసిక ప్రశాంతత కోసం కొంచెం తీసుకుంటే ఫర్వాలేదు. కానీ అధికంగా మద్యం తీసుకోవడం వల్ల ఆర్థికంగా నష్టంతో పాటు ఆరోగ్యాన్ని దెబ్బతీసే దారులు ఏర్పడుతాయి. రాత్రి అతిగా మద్యం తీసుకోవడం వల్ల ఏర్పడే హ్యాంగోవర్ పై అనేక పరిశోధనలు జరిగాయి.
అసలు హ్యాంగోవర్ ఎందుకు ఏర్పడుతుంది..? అనే విషయంపై కొందరు వివిధ కారణాలు చెబుతున్నారు. అతిగా మద్యం తీసుకోవడం వల్ల శరీరంలో సహజంగా ఏర్పడే రసాయనాలను తగ్గిస్తుంది. ఇలాంటి వారిలో రక్తంలో ఇథనాల్, డీ కంపోజిషన్ ఉత్పత్తుల సాంద్రత పెరుగుతుంది. మరికొందరు వ్యాధి నిరోధకతో ముడిపెట్టారు. మద్యం తీసుకోవడం వల్ల కడుపు మంట ఏర్పడి హ్యాంగోవర్ కు దారి తీస్తుందని అంటున్నారు.
మద్యం తీసుకున్నప్పుడు ఇథనాల్ నేరుగా ఆహార నాలంలోకి వెళ్తుంది. ఆ తరువాత కాలేయానికి చేరుతుంది. ఈ తరుణంలో ఎంజైమ్ యాక్టివిటి పెరిగి కాలేయం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ ఇథనాల్ క్రియలు ఎక్కువగా జరగడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. ఆ తరువాత పొట్టలో మంట ఏర్పడి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డెవలప్ కావడానికి దారి తీస్తుంది. ఇది మరింత తీవ్రమైతే ఆల్కహాలిక్ హైపటైటిస్ లేదా సిర్రోసిస్ కు కారణమవుతుంది.
హ్యాంగోవర్ తగ్గడానికి కొందరు రకరకాలుగా టాబ్లెట్లను వాడుతున్నారు. వీటిలో పారాసెటమాల్, ఐబప్రోఫెనా ప్రధానమైనవి. సాధారంగా పారాసెటమాల్ జ్వరాన్ని, అనాల్జెసిక్ తగ్గడానికి పనిచేస్తుంది. అందువల్ల పెయిన్ కిల్లర్ గా దీనిని వాడుతారు. హ్యాంగోవర్ వల్ల కొందరికి కడుపులో మంట ఉంటుంది. కానీ పారాసెటమాల్ కడుపులో మంటను తగ్గించదు. అయితే ఇది వాడడం వల్ల పెద్దగా దుష్ఫరిణామాలు ఉండవు. ఇది తీసుకోవడం వల్ల రక్తంలో కలిసిపోయి కాలేయంలోని జీవక్రియకు చేరుతుంది. ఇక్కడ మార్పు చెందిన అణువులు కిడ్నీల ద్వారా బయటకు వెళ్తాయి.
ఇక ఐబోప్రోఫెన్ ను పన్ను నొప్పి, కండరాలకు, రుతు క్రమంలో వచ్చేపెయిన్ తగ్గించడానికి వాడుతుంటారు. ఐబోప్రొఫెన్ కాలేయానికి ఎలాంటి హాని చేయదు. ఇది గ్యాస్ట్రిక్ ముకోపా పై ప్రభావం చూపి హ్యాంగోవర్ బాధను తగ్గిస్తుంది. కానీ ఇన్ ఫ్లమేటరీ డ్రగ్స్ తో పోలిస్తే దీని ప్రభావం తక్కువే.
ఐబోప్రోఫెన్ కన్నా పారాసెటమాల్ పవర్ అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల జీవక్రియ మీద ప్రభావం చూపుతుంది. దీంతో వెంటనే ఆల్కహాల్ జీర్ణమై చిన్న చిన్న అణువులుగా మారి కిడ్నీల ద్వారా బయటకు వెళ్తాయి. కాలేయంలో రెండు ప్రక్రియలు అంటే 80 శాతం గ్లూకురోనిక్ యాసిడ్ తో సంయోగం ద్వారా 20 శాతం సైప్2ఈ1 ఎంజైమ్ ద్వారా జీవక్రియ కొనసాగేలా చేస్తుంది. సైప్2ఈ1 ఎంజైమ్ ద్వారా జీవక్రియగా మారిన పారాసెటమాల్లోని చిన్న భాగం అత్యంత రియాక్టివ్ మెటాబోలైట్ ఎంజైమ్ NAPQIగా మారుతుంది. ఇది ఆక్సిడేషన్ ప్రెషర్ కు , కణాల మరణానికి దారి తీస్తుతుంది. అయితే మొత్తంగా పారాసెటమాల్ కన్నా ఐబోప్రోఫెన్ మంచిదని అంటున్నారు. హ్యాంగోవర్ తో పాటు కడుపులో ఉండే నొప్పిని కూడా తగ్గించే గుణం ఉండడంతో వైద్యుల సలహాతో దీనిని వాడొచ్చని అంటున్నారు.