TTD Recruitment 2021: తిరుమల తిరుపతి దేవస్థానం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 11 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మొత్తం 11 ఉద్యోగ ఖాళీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగ ఖాళీలు 5 ఉండగా సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఉద్యోగ ఖాళీలు 3, రెసిడెంట్ డాక్టర్ల ఉద్యోగ ఖాళీలు 2 ఉన్నాయి. అక్టోబర్ 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

https://www.tirumala.org/sabirrd.aspx వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు ఏడాది పాటు పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అర్హత, అనుభవంను బట్టి భారీ వేతనం లభించే అవకాశాలు అయితే ఉంటాయి.
అర్హత, అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. నిరుద్యోగులకు మేలు జరిగేలా ఈ మధ్య కాలంలో వరుస జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ కానుండగా టీటీడీ నుంచి సైతం నిరుద్యోగులకు మేలు జరిగే విధంగా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. ఆఫ్ లైన్ విధానంలో కూడా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
డైరెక్టర్ కార్యాలయం, బీఐఆర్‌ఆర్‌డీ ఆసుపత్రి, టీటీడీ, తిరుపతి అడ్రస్ కు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వాళ్లు దరఖాస్తులను పంపాల్సి ఉంటుందని సమాచారం.