https://oktelugu.com/

Romance : శృంగారానికి ముందు ఇవి తిన్నారంటే.. ఏం జరుగుతుందంటే?

మనలో చాలా మంది శృంగారానికి ముందు స్వీట్లు తింటారు. తీపి పదార్థాలు తినడం వల్ల నిద్ర ముంచుకొస్తుంది. దీంతో శృంగారంపై ఆసక్తి కలగదు. ఉద్వేగం పెరగడం కష్టమవుతుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : July 23, 2023 / 06:07 PM IST
    Follow us on

    Romance : మనం శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయానుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవితంలో శృంగారమే ప్రధానమైన భాగం. అందుకే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. రోజు శృంగారంలో పాల్గొంటే రోగాలు కూడా రావని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శృంగారాన్ని ఆస్వాదించాలంటే మనం కొన్నింటికి దూరంగా ఉండాలి. అప్పుడే రసానుభూతి కలుగుతుంది. శృంగారంలో తారాస్థాయికి వెళతాం. దీని వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. శృంగారానికి ముందు ఏం తినకూడదో తెలుసుకుందాం.

    ఉప్పు

    శృంగారానికి ముందు ఉప్పుతో తయారు చేసినవి తినడం అంత మంచిది కాదు. ఇవి కడుపులో ఉబ్బరం కలిగిస్తాయి. రక్త ప్రవాహానికి అడ్డుగా నిలుస్తాయి. భావప్రాప్తి కలగకుండా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే ఉప్పుతో చేసినవి తినకుండా ఉండటమే శ్రేయస్కరం. సంభోగంలో సరిగా పాల్గొనలేకపోతాం. దీంతో ఉప్పును దూరం చేసుకోవడమే బెటర్.

    మద్యపానం

    శృంగారానికి ముందు అల్కహాల్ తీసుకోవడం మంచిది కాదు. ఇది మన శరీర భాగాలను కదలకుండా చేస్తుంది. రక్తసరఫరాను అడ్డుకుంటుంది. ఇది మిమ్మల్ని బద్ధకంగా మారుస్తుంది. దీంతో శృంగారంలో చురుకుగా కదలలేం. మన అవయవాలు మొద్దుబారిపోతాయి. అల్కహాల్ నిద్రను ప్రేరేపించే హార్మోన్ అయిన మెలటోనిన్ ను పెంచుతుంది.

    సోయా ఉత్పత్తులు

    సోయా ధాన్యాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీని వల్ల హార్మోన్లు అసమతుల్యంగా మారతాయి. శృంగారానికి ముందు ఇవి తినడం వల్ల కోరికలు తగ్గిపోతాయి. సంభోగానికి ముందు వీటిని తినడం వల్ల ఆసక్తి తగ్గుతుది. దీంతో శృంగారంలో అనుభూతి పొందలేరు. అందుకే వీటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. సోయాలు తినడం వల్ల శృంగారంలో నష్టాలు వస్తాయి.

    తీపి పదార్థాలు

    మనలో చాలా మంది శృంగారానికి ముందు స్వీట్లు తింటారు. తీపి పదార్థాలు తినడం వల్ల నిద్ర ముంచుకొస్తుంది. దీంతో శృంగారంపై ఆసక్తి కలగదు. ఉద్వేగం పెరగడం కష్టమవుతుంది. శరీరంలో చక్కెర పెరిగి ఇన్సులిన్ స్థాయి తగ్గిస్తుంది. ఇలా స్వీట్లు తినడం వల్ల మనకు ఇబ్బందులు కలుగుతాయి. స్వీట్లలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల నష్టం.