https://oktelugu.com/

Beer: రోజూ 1 గ్లాస్ బీరు తాగితే ఏమవుతుంది? హెల్త్ సీక్రెట్ బయటపడింది

బీరు కూడా తగిన మోతాదులో రోజుకు ఒక గ్లాసు తాగితేనే మంచిది. అధికంగా తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఇందులో కొన్ని రకాల సమ్మేళనాలు ఉండటం వల్ల పాలిఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె ఆరోగ్యానికి బీరులో ఉండే విటమిన్ల వల్ల మేలు కలుగుతుంది. పొటాషియం, మెగ్నిషియం, పాస్పరస్, ఫైబర్ వంటివి ఉండటం వల్ల వ్యాధులు రాకుండా చేస్తాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : June 17, 2023 / 05:39 PM IST

    Beer

    Follow us on

    Beer: ఎండాకాలంలో ఉక్కపోత ఇబ్బంది పెడుతుంది. వేడి నుంచి తట్టుకోవడానికి శీతల పానీయాలు, సోడాలు తాగుతుంటారు. ఇంకా కొందరైతే బీర్లు తాగుతూ వేడి నుంచి ఉపశమనం పొందాలని చూస్తారు. కానీ వీటి వల్ల ఇబ్బందులు వస్తాయి. వేసవి కాలంలో వేడిని తట్టుకోవాలంటే మంచినీళ్లే ఆధారం. లేకపోతే కొబ్బరి బొండాలు తాగితే కూడా సురక్షితమే. బీరు తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.

    బీరు కూడా తగిన మోతాదులో రోజుకు ఒక గ్లాసు తాగితేనే మంచిది. అధికంగా తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఇందులో కొన్ని రకాల సమ్మేళనాలు ఉండటం వల్ల పాలిఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె ఆరోగ్యానికి బీరులో ఉండే విటమిన్ల వల్ల మేలు కలుగుతుంది. పొటాషియం, మెగ్నిషియం, పాస్పరస్, ఫైబర్ వంటివి ఉండటం వల్ల వ్యాధులు రాకుండా చేస్తాయి.

    బీరు తగిన మోతాదులో తాగడం వల్ల రిలాక్స్ గా ఉంటుంది. మానసిక ప్రశాంతత వస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. నిద్ర చక్కగా పట్టేందుకు అవకాశం ఉంటుంది. బీరు తాగడం వల్ల ఎముకలు బలపడతాయి. బీరు తగిన మోతాదులో తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్లు రాకుండా అరికట్టవచ్చు. బీరు తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని చెబుతున్నారు.

    బీరు ఎక్కువగా తాగితే అనర్థాలు వస్తాయి. మద్యానికి బానసలుగా మారే ప్రమాదముంది. బీరు తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. కొవ్వు పేరుకుపోతుంది. ఆరోగ్యకరమైన లాభాల కంటే అనారోగ్యాలే ఎక్కువగా వస్తాయి. బీరులో కేలరీలు అధికంగా ఉంటాయి. రోజు బీరు తాగితే బరువు పెరుగుతారు. గుండె జబ్బులతో పాటు మధుమేహం రావడానికి ఆస్కారం ఉంటుంది.