Chanakya Neethi: ఆచార్య చాణుక్యుడు మంచి ఆర్థికవేత్త, వ్యూహకర్త అనే విషయం తెలిసిందే. చాణుక్యుడు తన పుస్తకాల ద్వారా నిజ జీవితంలో ఏ విధంగా వ్యవహరిస్తే మంచిదో చెప్పుకొచ్చారు. మహిళల గురించి చాణుక్యుడు 4 ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చాణుక్యుడు మహిళల గురించి చెప్పిన విషయాలకు సంబంధించి సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా చాలామంది చాణుక్యుడు చెప్పిన మాటలతో ఏకీభవిస్తారు.
ఒకవేళ భర్త అనుమతి తీసుకోకుండా భార్య పనులు చేస్తే మాత్రం భర్త ఆయుష్షు తగ్గుతుంది. అదే సమయంలో భర్త కంటే ముందు భార్య చనిపోయి నరకంలో శిక్షలు అనుభవిస్తుంది. స్త్రీ ఒక్క దెబ్బకే పురుషుడి బలం, శక్తిని లాగేయగలదని చాణుక్యుడు వెల్లడించారు. మంచి కుటుంబానికి చెందిన అందంగా లేని స్త్రీని వివాహం చేసుకోవచ్చని కుటుంబం మంచిది కాకపోతే అందంగా లేకపోయినా పెళ్లి చేసుకోకూడదని చాణుక్యుడు తెలిపారు.
స్త్రీల నుంచి కపటం, వంచన ఎలా చేయాలో నేర్చుకోవాలని చాణుక్యుడు తెలిపారు. రుతుక్రమం స్త్రీలను శుభ్రం చేస్తుందని చాణుక్యుడు వెల్లడించారు. స్త్రీలో చనువు ఎప్పటికైనా ప్రమాదమేనని చాణుక్యుడు అన్నారు. స్త్రీ మనస్సును అర్థం అర్థం చేసుకోలేమని చాణుక్యుడు వెల్లడించారు.