Kidney Stones: ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని కిడ్నీలో రాళ్ల సమస్య వేధిస్తోంది. ఈ సమస్య చిన్న సమస్యే అయినప్పటికీ ఈ సమస్య బారిన పడితే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఎవరైతే నీళ్లు తక్కువగా తాగుతారో వాళ్లను ఎక్కువగా ఈ ఆరోగ్య సమస్య వేధిస్తుంది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవాళ్లను మూత్ర సంబంధిత సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి.
మూత్ర విసర్జన సమయంలో మంట లేదా నొప్పి ఉంటే కిడ్నీ స్టోన్స్ సమస్య అయ్యే అవకాశాలు ఉంటాయి. అతి మూత్ర సమస్య వేధిస్తుంటే కూడా అందుకు కిడ్నీ స్టోన్స్ సమస్య కారణమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బరువు తగ్గడం, కడుపులో నొప్పి, తరచూ జ్వరం వస్తున్నా కిడ్నీ స్టోన్స్ సమస్య అయ్యే అవకాశం ఉంటుంది. మూత్రం నుంచి రక్తం వస్తున్నా మూత్రం చుక్కలుచుక్కలుగా వస్తున్నా కిడ్నీలో రాళ్ల సమస్య అయ్యే ఛాన్స్ ఉంటుంది.
Also Read: India Russia Relations: రష్యాను నమ్ముకుని ఒంటరి కానున్న భారత్?
కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా సులువుగా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. దానిమ్మ రసం తీసుకోవడం ద్వారా కిడ్నీ స్టోన్స్ కు చెక్ పెట్టవచ్చు. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో దానిమ్మ రసం ఉపయోగపడుతుంది. మొక్కజొన్న కంకిని ఒలిచే సమయంలో దారాల్లాంటి కార్న్ సిల్క్ ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ కు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.
నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ మిశ్రమం తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ సమస్య దూరమవుతుంది. తులసి ఆకులను ఎండబెట్టి ఆ ఎండబెట్టిన పొడితో చేసిన టీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. తులసి ఆకులు కడుపులోని ఎసిటిక్ యాసిడ్‌ను విచ్ఛిన్నం చేసే అవకాశాలు ఉంటాయి.