https://oktelugu.com/

జ్వరం వస్తే తినకూడని ఆహార పదార్థాలేంటో తెలుసా..?

మనలో చాలామంది సీజన్లతో సంబంధం లేకుండా జ్వరంతో బాధ పడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాతావరణంలో మార్పుల వల్ల, ఎక్కువగా పని చేయడం వల్ల కూడా జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ట్యాబ్లెట్లు వేసుకుని, విశ్రాంతి తీసుకుని తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల తక్కువ సమయంలో జ్వరం నుంచి కోలుకోవచ్చు. అయితే జ్వరం వచ్చిన సమయంలో కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్థాలు శరీర ఉష్ణోగ్రతను మరింత పెంచుతాయి. అలాంటి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 13, 2020 10:41 am
    Follow us on


    మనలో చాలామంది సీజన్లతో సంబంధం లేకుండా జ్వరంతో బాధ పడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాతావరణంలో మార్పుల వల్ల, ఎక్కువగా పని చేయడం వల్ల కూడా జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ట్యాబ్లెట్లు వేసుకుని, విశ్రాంతి తీసుకుని తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల తక్కువ సమయంలో జ్వరం నుంచి కోలుకోవచ్చు. అయితే జ్వరం వచ్చిన సమయంలో కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు.

    కొన్ని ఆహార పదార్థాలు శరీర ఉష్ణోగ్రతను మరింత పెంచుతాయి. అలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల జ్వరం తగ్గకపోగా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల జ్వరం వచ్చిన సమయంలో తీసుకునే ఆహార పదార్థాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లలా జ్వరం కూడా ఒక రకమైన ఇన్ఫెక్షన్. జ్వరం వచ్చిన సమయంలో సాధారణంగా తీసుకునే నీళ్లతో పోలిస్తే ఎక్కువగా నీళ్లు తీసుకోవాలి.

    తాజా పండ్లను శుభ్రంగా కడిగి కోసిన వెంటనే తినాలి. ఎక్కువగా పండ్ల రసాలను తీసుకోవడం వల్ల నీరసం తగ్గి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అయితే జ్వరంతో బాధ పడుతున్న వాళ్లు జంక్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉండాలి. మసాలాతో వండిన ఆహారాలను అస్సలు తీసుకోకూడదు. జంక్ ఫుడ్, మసాలాలు ఇన్ఫెక్షన్ పెంచే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

    జ్వరం వచ్చిన సమయంలో జీర్ణాశయంపై ఒత్తిడిని పెంచే పీచు పదార్థాలను తినకపోవడమే మంచిది. సలాడ్స్, బ్రెడ్, ఓట్స్ కు వీలైనంత దూరంగా ఉండాలి. పాలతో చేసిన పదార్థాలను, మాంసాహారాన్ని జ్వరం వచ్చిన సమయంలో తినకపోవడమే మంచిది.