Weight Loss: డైటింగ్ చేయకుండా సులభంగా బరువు తగ్గవచ్చు.. ఏ విధంగా అంటే?

Weight Loss: ఈ మధ్య కాలంలో బరువు సమస్య చాలామందిని వేధిస్తోంది. పెరిగిన బరువును తగ్గించుకునే విషయంలో ఎంతోమంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. డైటింగ్ లేకుండా బరువు తగ్గడం సాధ్యం కాదని చాలామంది భావిస్తున్నారు. అయితే వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. కొన్ని పద్ధతులను అవలంబించడం ద్వారా అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు. Also Read: వాషింగ్ మెషీన్ లో వేసిన బట్టలు తళతళా మెరవాలంటే పాటించాల్సిన చిట్కాలివే? […]

Written By: Navya, Updated On : November 24, 2021 12:58 pm
Follow us on

Weight Loss: ఈ మధ్య కాలంలో బరువు సమస్య చాలామందిని వేధిస్తోంది. పెరిగిన బరువును తగ్గించుకునే విషయంలో ఎంతోమంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. డైటింగ్ లేకుండా బరువు తగ్గడం సాధ్యం కాదని చాలామంది భావిస్తున్నారు. అయితే వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. కొన్ని పద్ధతులను అవలంబించడం ద్వారా అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు.

Also Read: వాషింగ్ మెషీన్ లో వేసిన బట్టలు తళతళా మెరవాలంటే పాటించాల్సిన చిట్కాలివే?

ఎవరైతే బరువు తగ్గాలని అనుకుంటారో వాళ్లు ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని పుష్కలంగా తీసుకోవాలి. ప్రోటీన్ల ద్వారా జీవక్రియ మెరుగుపడే అవకాశంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. చికెన్ బ్రెస్ట్, సాల్మన్ ఫిష్, గుడ్డు, టోఫు, సోయా పాలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, బీన్స్, లీన్ మీట్, పప్పులు, మొలకలు తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుంది.

ఆహారాన్ని చాలామంది వేగంగా తింటారు. అయితే అలా కాకుండా ఏది తిన్నా దానిని మెత్తగా నమిలి తింటే మంచిదని చెప్పవచ్చు. నమిలి తినడం వల్ల తక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది. లాలాజలంలోని ఎంజైమ్ ల సహాయంతో జీర్ణక్రీయ ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి నమిలి ఆహారం తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో చాలామంది స్నాక్స్ తింటూ ఉంటారు.

స్నాక్స్ తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. తక్కువ కేలరీలను ఉన్న ఆహారాలను తినడం వల్ల బరువు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. గ్రీన్ టీ, హెర్బల్ టీ తాగడం ద్వారా కూడా సులభంగా బరువును అదుపులో ఉంచుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తినడం ద్వారా కూడా అధిక బరువు సమస్యకు సులభంగా చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.

Also Read: మొటిమల సమస్య వేధిస్తోందా.. అయితే వీటికి దూరంగా ఉండండి?