Banana
Banana: శరీరానికి తక్షణమే బలాన్నిచ్చే వాటిలో అరటి పండు ఒకటి. దీనిని రోజు తినడం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది. వీటిని ఎక్కువగా జిమ్‌కి వెళ్లేవాళ్లు, ఎక్స్‌ర్‌సైజ్ చేసేవాళ్లు తింటారు. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. రోజుకి కనీసం ఒక్కటి తిన్న వెంటనే బలం వస్తుంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈరోజుల్లో అరటి పండ్లు హైబ్రిడ్‌వి ఎక్కువగా లభిస్తున్నాయి. వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈరోజుల్లో సహజంగా పండే పండ్లు దొరకడం చాలా కష్టం. రూరల్ ఏరియా లేదా గ్రామాల్లో ఈ పండ్లు దొరుకుతున్నాయి. పట్టణాల్లో అయితే అంతా హైబ్రిడ్ పండ్లే లభిస్తాయి. అయితే రోజూ అరటి పండ్లు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. రోజూ వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే కొందరు ఎక్కువగా పండిన అరటి పండ్లు తింటే మరికొందరు కాస్త పండిన వాటిని తింటారు. ఇంతకీ అరటి పండ్లలో ఎలాంటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదో ఈ స్టోరీలో చూద్దాం.
అరటి పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్, ప్రొటీన్లు, ప్రీబయోటిక్స్, విటమిన్లు ఉంటాయి. అయితే ఇవి బాగా పండిన అరటి పండ్లలో చాలా తక్కువగా ఉంటాయి. అరటి పండ్లను కాయగా లేకుండా మరీ పండిన విధంగా ఉన్నవి తినకూడదు. వీటిలో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉండదు. దీనివల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు అందవు. బాగా పండిన కాకుండా పండిన అరటి పండ్లను తినడం వల్ల శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వాటిని తినడం వల్ల శరీరానికి ఫైబర్, ప్రొటీన్లు అధిక మొత్తంలో శరీరానికి అందుతాయి. ఇందులోని ప్రోబయోటిక్స్ కూడా శరీరానికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. అరటి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను క్లియర్ చేయడంలో కూడా బాగా సహాయపడుతుంది. బాగా పండిన అరటి పండ్లు కాకుండా సరిగ్గా పండిన అరటి పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు.
బాగా పండిన అరటి పండ్లపై నల్లటి మచ్చలు వస్తుంటాయి. వీటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని కొందరు భావిస్తారు. అయితే బాగా పండటం వల్ల మాత్రమే వీటిపై నల్ల మచ్చలు వస్తాయట. ఇలా బాగా పండిన అరటి పండ్లను తినడం వల్ల జీర్ణ సమస్యలు అన్ని క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బాగా పండిన అరటి పండ్లు కూడా శరీరానికి పోషకాలను అందిస్తాయట. ఇందులో ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి. దీంతో రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రక్తహీనతను కూడా తగ్గించడంలో అరటి పండ్లు బాగా సహాయపడతాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.