
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కోట్ల మంది ప్రాణాలను తీసుకుంది. లెక్కలెనంతమందికి వైరస్ సోకింది. అయితే కరోనా వైరస్ ట్రీట్మెంట్ పై రకరకాల వాదనలు ఉన్నాయి. కరోనా చికిత్సలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా లక్షణాలు ఎలా ఉంటాయనేది వైద్యులు కొన్ని సూచలను చేశారు. అయితే చాలా మందికి రుచి, వాసన కోల్పోతో కరోనా సోకినట్లేనా..? అన్న సందేహం నెలకొంది. ఒకవేళ రుచి, వాసన కోల్పోతే తిరిగి ఎప్పుడు వస్తుందోనన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.
కరోనా సోకితే రుచి, వాసన కోల్పోతే తిరిగి ఎప్పుడు వస్తుందోన్న విషయంపై కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. పరిశోధకులు కరోనా కారణంగా రుచి, వాసన కోల్పోయిన 97 మందిపై పరిశోధకులు ఏడాది పాటు అధ్యయనం చేశారు. 97 మందిలో 51 మందిని ప్రతి నాలుగు నెలలకోసారి వాసన, రుచి తిరిగొచ్చిందో లేదో పరీక్షించుకొని నివేదిక ఇవ్వాలని కోరారు.
అయితే 51 మందిలో 41 మందికి పూర్తిగా రుచి, వాసన వచ్చింది. మిగతా ఇద్దరిలో పాక్షికంగా వచ్చింది. అయితే మిగతా 46 మందిలో ఎలాంటి పురోగతి లేదు. మొత్తంగా కరోనా కారణంగా రుచి, వాసన కోల్పోతే యథాస్థితికి రావడానికి సంవత్సరం పడుతుందని అంటున్నారు. అయితే యాంటిబాడీస్ ఎక్కువగా ఉన్నవారిలో కొద్ది రోజులకే రుచి, వాసన తెలిసినా పూర్తిగా రాలేదని అంటున్నారు.