Homeహెల్త్‌Vitamin D Rich Foods Milk Vs Eggs: పాలు తాగాలా.. గుడ్లు తినాలా.. "విటమిన్...

Vitamin D Rich Foods Milk Vs Eggs: పాలు తాగాలా.. గుడ్లు తినాలా.. “విటమిన్ డీ” ఎందులో ఎక్కువంటే..

Vitamin D Rich Foods Milk Vs Eggs: మన శరీరంలో అత్యంత కీలకమైన విటమిన్ “డీ”. ఎముకలలో దృఢత్వాన్ని.. శరీరాన్ని పటిష్టం చేయడంలో డీ విటమిన్ సహకరిస్తుంది. సూర్యుడి ద్వారా డీ విటమిన్ లభిస్తుంది. కాకపోతే సూర్యోదయం సమయంలోనే ఈ విటమిన్ శరీరానికి సమకూరుతుంది. అందువల్లే సూర్యోదయం సమయంలో ఎండలో నడవాలని మన పెద్దలు చెబుతుంటారు.

సూర్యోదయం సమయంలో నడిచే అవకాశం లేనివారు వివిధ ఆహార పదార్థాల ద్వారా డీ విటమిన్ పొందొచ్చు. పాలల్లో విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది. ఎముకలు విరిగినవారు.. ఎముకల్లో బలం లేని వారు.. పాలను ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తుంటారు.. అయితే పాలను అదేపనిగా తాగితే ఇబ్బందిగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం వారి వారి శరీర అవసరాల దృష్ట్యా.. వైద్యుల సలహాల మేరకు పాలను తీసుకోవాల్సి ఉంటుంది.

పాలు మాత్రమే కాకుండా.. గుడ్లలో కూడా విటమిన్ డీ ఉంటుంది. కోడిగుడ్డు సోనలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే కొందరి రక్తంలో కొవ్వులు అధికంగా ఉంటాయి. అటువంటివారు సొన తినకపోవడమే మంచిది. పరిమాణం పరంగా పాలల్లో విటమిన్ డి ఎక్కువగా ఉన్నప్పటికీ.. గుడ్డు సొన లో ఉండే విటమిన్ డి-3 ని శరీరం త్వరగానే సంగ్రహిస్తూ ఉంటుంది. కేవలం ఆహారం తీసుకోవడం ద్వారా మాత్రమే విటమిన్ డి ని భర్తీ చేయలేమని వైద్యులు చెబుతున్నారు.

ఎముకల్లో బలం పెరగాలంటే.. శరీరం రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే.. సూర్యోదయం సమయంలో ఎండ కూడా అవసరమేనని వైద్యులు అంటున్నారు. సూర్యోదయం సమయంలో ఎండ ద్వారా వచ్చే విటమిన్ డి ని శరీరం త్వరగా సంగ్రహించుకుంటుంది. అలాగే ఆహారం ద్వారా కూడా విటమిన్ డి ని శరీరానికి ఇవ్వాల్సి ఉంటుంది. పాలు లేదా గుడ్లు ఇలా ఏ ఆహారం తీసుకున్నా సరే.. అది శరీర అవసరాలకు లోబడి ఉండాలి. అలా కాకుండా ఎక్కువ ఆహారం తీసుకుంటే ఆ తదుపరి పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయి.

ఓ నివేదిక ప్రకారం మనదేశంలో 67% మంది విటమిన్ డి కొంత బాధపడుతున్నారు. కొందరు విటమిన్ డి ని శరీరానికి అందించడానికి విటమిన్ కలిపిన పాలు (వీటినే ఫోర్టిఫైడ్ మిల్క్ అని పిలుస్తారు) తాగుతుంటారు. ఆహారం ఏ స్థాయిలో తీసుకున్నప్పటికీ.. సూర్యోదయం సమయంలో ఎండలో కాసేపు నడిస్తే విటమిన్ డి లభిస్తుంది. అది ఎముకల దృఢత్వానికి ఉపకరిస్తుంది. శరీర రోగ నిరోధక శక్తికి సహాయపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా శరీర ఎదుగుదలలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది.

గమనిక

ఈ కథనం వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వివిధ వేదికల వద్ద సేకరించిన సమాచారాన్ని పాఠకులకు అందించడానికి మేము చేసిన ప్రయత్నం మాత్రమే. విటమిన్ డి లోపంతో బాధపడుతున్న వారు ఈ కథనాన్ని చికిత్సకు ప్రత్యామ్నాయంగా చూడవద్దని మా మనవి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version