Rajnigandha Plant: ఇంటిని చూసి ఇల్లాలును చూడాలన్నారు. ఇంటి అందం అంతా ఇల్లాలు పనితీరు మీదే ఆధారపడి ఉంటుంది. ఇంటిని చక్కగా దిద్దుకోవడంలో ఆడవారి పాత్ర అనిర్వచనీయం. ఇంటికి ఎక్కువ అందాన్ని ఇచ్చేవి చెట్లు, మొక్కలే కావడం గమనార్హం. పరిసరాలను శుద్ధిచేయడంలో ఎన్నో మొక్కలు తమ వంతు పాత్ర పోషిస్తాయి. అందుకే వాస్తు శాస్త్రంలో కూడా మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇచ్చారని తెలిసిందే. ఇందులో ట్యూబెరోస్ మొక్కది ప్రత్యేక స్థానమే అని చెప్పుకోవాలి. దీన్ని ఇంట్లో పెట్టుకోవడం శుభంగానే చూసుకోవచ్చు.
రజనీగంధ మొక్కతో సానుకూల ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు. ప్రతికూలతనుతొలగించి వాస్తు దోషాలు తొలగించుకోవడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. వాస్తు శాస్త్రంలో దీనికి ప్రాధాన్యత ఎక్కువగానే ఉండటం తెలుసుకోవచ్చు. ఈ మొక్కనుఉత్తర దిశలో కానీ తూర్పు దిశలో అయినా నాటితే సానుకూల అంశాలే ఎదురవుతాయనడంలో సందేహం లేదు. కుటుంబ సభ్యుల్లో కూడా మంచి ఆదరణ లభిస్తుంది.
Also Read: AP Housing Scheme: ఆ మొత్తంతో ఇల్లు కట్టలేం.. తేల్చిచెబుతున్న లబ్ధిదారులు
భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నట్లయితే సమసిపోతాయి. దీన్ని పెంచడం వల్ల ప్రయోజనాలు అనేకంగాఉంటాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం రోజురోజుకు పెరుగుతుంది. ఇంట్లో సంతోషం, సంపద వెల్లివిరుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవితంలో ఎదిగేందుకు తోడ్పడుతుంది. అందుకే ఈ మొక్క ఇంటిలో ఉంచుకోవడం శ్రేయస్కరమే అని గుర్తిస్తే మంచిది.
మొక్కలు, చెట్లు కూడా మన వాస్తు దోషాల్ని కాపాడుతాయి. అందుకే కొన్ని మొక్కలను గుర్తించుకుని ఇంటిలో నాటుకోవవాలి. డబ్బు కు ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవాలని చెబుతారు. ఈనేపథ్యంలో రజనీగంధ మొక్కను ఇంటి ఆవరణలో ఉంచుకోవడం అందరికి శుభ పరిణామమే అవుతుంది. దీన్ని అందరు గమనించి రజనీగంధ మొక్కను ఇంటిలో పెంచుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడింది.
మొక్కలతో ఏమవుతుందిలే అనే ధోరణి అవసరం లేదు. ఎందుకంటే వాటితో మనకు జరిగే నష్టం కన్నా లాభమే మిన్న. అందుకే పెద్ద ఖర్చు లేకుండా పెంచుకునే మొక్కలను పెంచుకుని తమ పరిసరాలను అందంగా ఉంచుకోవడమే కాకుండా తమ బాధలను దూరం చేసే వాటిని దగ్గరకు తెచ్చుకోవడంతో ప్రయోజనం కలుగుతుందని భావించుకుని పెంచుకోవాలి.
Also Read:Husband And Wife Relation: భార్యలు శృంగారానికి ఒప్పుకోకపోతే భర్తలు ఏం చేస్తున్నారో తెలుసా?