Vastu Tips For House: తెగించిన వాడికి తెడ్డే అన్నీ అంటారు. వాస్తు గిస్తూ లేకుండా హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో కార్ పార్కింగ్ అంత స్థలంలోనూ రెండు మూడు ఫ్లోర్లు వేసి కిరాయిలు సంపాదిస్తున్న వారు ఎంతో మంది. చిన్న స్థలాలే కాదు.. పెద్ద స్థలాలు, అపార్ట్ మెంట్లలోనూ కిచెన్, నీళ్ల సంపు, బెడ్ రూం, హాల్ లు వాస్తు ప్రకారం అసలే ఉండవు. వారి కంఫర్ట్ ప్రకారం వాళ్లు పెట్టుకుంటూ వెళుతారు.
అయితే వాస్తు నిపుణులకు గౌరవం ఇచ్చి మరికొందరు అచ్చం అలాగే ఇంటిని నిర్మించుకుంటారు. అలా నమ్మిన సిద్ధాంతం ప్రకారం హాయిగా కాలం గడుపుతారు.
వాస్తు నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఆ ఇంట్లో డబ్బు నిలవడం లేదంటే అందులో ఒక మేజర్ సమస్య ఉన్నట్టు అని చెబుతున్నారు. ఏ ఇంట్లో అయితే నీరు వృథాగా పోతుందో.. ఆ ఇంట్లో డబ్బు నిలవదని.. ఆర్థిక ఇబ్బందులు తిష్ట వేస్తాయట..
అందుకే ఇంట్లో నల్లాలు లీక్ అవ్వడానికి.. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులకు ఏంటి సంబంధం అనే సందేహం చాలా మందికి కలుగవచ్చు. కానీ వాస్తు నిపుణులు చెబుతున్న ప్రకారం ఏ ఇంట్లో అయితే నీరు వృథాగా ఖర్చు అవుతుందో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తిష్ట వేస్తాయంట.. నీరు వృథా అంటే వరుణ దేవుడికి ఆగ్రహం తెప్పించడమంట.. దీని వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తిష్ట వేస్తుందట.. అక్కడి నుంచి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ!
ముఖ్యంగా కిచెన్ లో నల్లాలు లీక్ అయితే నిప్పు ఉన్న చోట నీళ్లు కారడం అశాంతికి చిహ్నం అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇది ఇంట్లో అనారోగ్య సమస్యలకు.. ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందట..
లీక్ అయ్యే నల్లాలు ఇంట్లో వృథా ఖర్చులను పెంచుతాయి కనుక వీలైనంత త్వరగా ఆ నల్లాలు మరమ్మతు చేయించి అనవసర ఖర్చులకు బ్రేక్ వేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. సో ఇన్ని అనార్థాలకు కారణమైన నీటి వృథాను తగ్గించుకుంటే మంచిది.
Also Read: దగ్గు, గొంతు నొప్పిని భరించలేకపోతున్నారా.. పాటించాల్సిన చిట్కాలు ఇవే!