Palm Oil: ఇప్పటికీ చాలా మంది వంటల్లో పామాయిల్ ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా హోటల్స్, రెస్టారెంట్స్‌లో దీని వాడకం మరింత ఎక్కువ ఉంటుంది. కానీ ఈ ఆయిల్ వల్ల చాలా ప్రమాదాలు సంభవిస్తాయి. ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఈ ఆయిల్ ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.రీసెంట్ గా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందట. పామాయిల్‌ను దీర్ఘకాలంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆ పరిశోధనలో తేలిందట.
పామాయిల్ తీసుకోవడం వల్ల మెటాస్టాటిక్ క్యాన్సర్ వస్తుందని వెల్లడైంది. బార్సిలోనాలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ బయోమెడిసిన్ ఎలుకలపై నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం తేలింది. పాల్మిటిక్ యాసిడ్ నోటి, చర్మ క్యాన్సర్‌లో మెటాస్టాసిస్‌ను ప్రోత్సహిస్తుందట. అయితే ఈ పామాయిల్ తాటి చెట్ల పండ్ల నుంచి తీసిన నూనె. ప్రస్తుతం ఈ ఆయిల్ ను ఎక్కువగా ప్యాక్ చేసిన ఆహారాలు, రెస్టారెంట్లలో ఉపయోగిస్తున్నారు. నిజానికి ఇతర నూనెల కంటే పామాయిల్ చాలా తక్కువ ధరలోనే లభిస్తుంది. ఇందులో పోషకాలు చాలా తక్కువ ఉంటాయి. సంతృప్త కొవ్వు ఉంటుంది. పామాయిల్ తరచుగా ఆహార ప్యాకెట్లలో ఉపయోగిస్తుంటారు కాబట్టి వాటిని తిన్నవారు కూడా సమస్యలను ఎదుర్కోవాల్సిందే.
ప్యాకీంగ్ చేసిన ఆహారంలో పామాయిల్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని తేలడంతో ఇలాంటి ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. దీని ద్వారా, సంతృప్త కొవ్వు శరీరంలోకి ప్రవేశించి సమస్యలను సృష్టిస్తుంది. ఇది ధమనులు బ్లాక్ అవ్వడానికి ప్రధాన కారణం అవుతుంది. ఇందులో సంతృప్త కొవ్వు అధికం. దీని వల్ల శరీరంలో ఎల్‌డిఎల్ స్థాయి పెరుగి చెడు కొలెస్ట్రాల్ కు దారి తీస్తుంది. దీని కారణంగా గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా 4 రెట్లు ఎక్కువ ఉంటాయి అంటున్నారు నిపుణులు.
పామాయిల్ వల్ల జీవక్రియ సమస్యలు కూడా వస్తాయి. ఇది జీర్ణ సమస్యలకు ప్రధాన కారణం అవుతుంది. పామాయిల్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగి.. మధుమేహం వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. పామాయిల్‌లో ఉండే సంతృప్త కొవ్వు క్యాన్సర్ వచ్చే సమస్యలను పెంచుతుంది. ముఖ్యంగా ఇది పెద్దప్రేగు, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే స్థాయిని కూడా పెంచుతుంది అంటున్నారు నిపుణులు. అందుకే ఈ పామాయిల్ నూనెకు దూరంగా ఉండటం చాలా వరకు బెటర్.
పామాయిల్ గురించి మరికొన్ని విషయాలు..
ఈ పామ్ ఆయిల్ ని తాజా పామ్ పండ్ల నుంచి తయారు చేస్తారు. ఇవి ఎరుపు ఆరెంజ్ రంగులో ఉంటాయి. రిఫైన్డ్ చెయ్యని పామ్ ఆయిల్ ని రెడ్ పామ్ ఆయిల్ అని పిలుస్తారు. పామాయిల్ కొబ్బరి నూనె లాగానే రూమ్ టెంపరేచర్ లో సెమి సాలిడ్ గా ఉంటుంది లేదంటే ఘనీభవిస్తుంది. అయితే ఈ పామాయిల్ వాడకం గతం తో పోల్చితే బాగా తగ్గి పోయిందట. ఇందులో అన్ సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఊబకాయం, కార్డియో వాస్క్యూలర్ డిసీజ్ లు వస్తున్నాయి కాబట్టి ప్రజలు కూడా దీని వాడకం చాలా వరకు తక్కువ చేశారు. పామ్ ఆయిల్ 50% సాచురేటెడ్ ఫ్యాటీ యాసీన్డ్స్ ని కంప్రెస్ చేస్తుంది సో మీరు కూడా ఇప్పటికీ వాడుతున్నా ఇకనైన పులిస్టాప్ పెట్టేయండి..