Health Tips: అందంగా కనిపించాలి అని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ కష్టమే. మారుతున్న బిజీ లైఫ్, ఆహారం వల్ల అందంగా కనిపించడం సవాలుగా మారుతుంది. అయితే దీనికోసం ఎన్నో పార్లర్స్ చుట్టూ తిరుగుతున్నా కూడా పలితం ఉండటం లేదు. కొన్ని సార్లు ఏకంగా ఖరీదైన ప్రాడక్టులను కూడా కొనుగోలు చేస్తున్నారు. అయినా నో యూజ్. అయితే ఒక్కసారి ఈ కొల్లాజెన్ క్రీమ్ ను ఉపయోగించండి. ప్రజెంట్ ఫుల్ పాపులర్ అవుతున్న ఈ క్రీమ్‌ని సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎన్నో రకాల బ్రాండ్స్ ఈ క్రీమ్స్‌ని తయారుచేస్తున్నారు కానీ మీరే ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల బెటర్ ఫలితాలు ఉంటాయి.మరి ఈ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఓసారి చూసేద్దామా?
కావాల్సినవి:
2 టేబుల్ స్పూన్స్ అలోవెరా జెల్, 1 టీ స్పూన్ కొబ్బరి నూనె, బాదంనూనె, 1 టీ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్, 1 టీ స్పూన్ తేనె, 1 లేదా 2 టీ స్పూన్స్ కొల్లాజెన్ పౌడర్ తీసుకోవాలి. ఇందులో అన్నింటికంటే ముఖ్యమైనది కొల్లాజెన్. దీనిని మీ స్కిన్ రొటీన్‌లో యాడ్ చేయడం వల్ల మీ మొత్తం చర్మ ఆరోగ్యంగా ఉంటుంది. దీని వల్ల వృద్ధాప్య లక్షణాలు దూరం అవుతాయి. అంతేకాదు స్కిన్ అందంగా యవ్వనంగా మెరుస్తుంది. ఇక విటమిన్ ఇ స్కిన్‌ని నరిష్ చేయడంలో సహాయం చేస్తుంది.
లోపలి నుంచి స్కిన్ అందంగా కనిపించేలా తోడ్పడుతుంది. దీంతో పాటు కొల్లాజెన్ ప్రొడక్షన్‌ని పెంచడంలో కూడా సహాయం చేస్తుంది. విటమిన్ ఇలో యాంటీ బ్యాక్టీరియల్, మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వంటి ప్రాబ్లమ్స్‌ని దూరం చేసి స్కిన్ ను కాపాడటంలో సహాయం చేస్తాయి. మరో వైపు కొబ్బరినూనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని రాయడం వల్ల డ్రై, స్కిన్ ఉన్నవారికి మంచి రెమెడీ అవుతుంది. అంతేకాదు స్కిన్ టెక్చర్ పెరిగి స్మూత్‌గా మారుతుంది. స్కిన్ గ్లో అయ్యేలా చేస్తుంది కొబ్బరి నూనె.
అలోవెరా జెల్ చాలా విధాలుగా చర్మానికి అవసరం. ముఖ్యంగా ఇది నేచురల్ మాయిశ్చరైజర్. ఇది స్కిన్‌ని డ్రైగా కాకుండా స్మూత్‌గా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కాబట్టి చర్మంపై మొటిమలు రావు. మరి ఈ మొత్తాన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే? ముందుగా కొబ్బరినూనె, బాదం నూనెలని ఓ పాన్‌లో వేసి కొద్దిగా వేడిచేయాలి. ఆ తర్వాత చల్లారనివ్వాలి. ఇందులోనే అలోవెరాజెల్, విటమిన్ ఇ ఆయిల్, తేనె వేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా కలపాలి.
ఈ మిశ్రమంలోనే కొల్లాజెన్ పౌడర్ వేసి కలపాలి. క్రీమీ టెక్చర్ వచ్చే వరకూ వీటన్నింటిని కలుపుతూనే ఉండాలి. తర్వాత ఓ ఎయిర్ టైట్ గ్లాస్ కంటెయినర్ తీసుకుని అందులో ఈ క్రీమ్ ను వేయాలి. దీన్ని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. దీనిని రోజు మీ స్కిన్‌కి రాసి స్మూత్ గా మసాజ్ చేస్తుండాలి. ఇందులో కలిపిన పదార్థాల వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉంటాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ క్రీమ్‌లోని కొన్ని పదార్థాలు అందరికీ పడకపోవచ్చు. కాబట్టి, దీనిని వాడే ముందు కచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంతా సరిగ్గా ఉందనుకున్నప్పుడే ఈ క్రీమ్‌ని మీ స్కిన్‌కేర్ రొటీన్‌లో యాడ్ చేసుకోవడం మంచిది. ఓ సారి స్కిన్ డాక్టర్ ను కూడా కలవడం ఉత్తమం.