spot_img
Homeహెల్త్‌Urination problems symptoms causes: యూరినేషన్ తరువాత ఇలా అవుతుందా.. నిర్లక్ష్యం చేయొద్దు..

Urination problems symptoms causes: యూరినేషన్ తరువాత ఇలా అవుతుందా.. నిర్లక్ష్యం చేయొద్దు..

Urination problems symptoms causes: కాలం మారుతున్న కొద్దీ కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. వాతావరణ కాలుష్యంతో పాటు తీసుకునే ఆహారంలో మార్పులు రావడంతో గతంలో ఎన్నడూ చూడని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందులో యూరినల్ సమస్య మరీ అవస్థను కలగజేస్తుంది. సాధారణంగా మూత్ర విసర్జన పూర్తయిన తరువాత మళ్లీ మూత్రం వచ్చే అవకాశం ఉండదు. కానీ కొందరికి మూత్ర విసర్జన పూర్తయిన తర్వాత కాసేపటికి కొన్ని చుక్కలు మళ్లీ బయటకు వస్తుంది. ఇది అసౌకర్యంగా అనిపిస్తుంది. వైద్యపరంగా దీనిని Post Micturition Dribble అని పిలుస్తారు. ఒకప్పుడు ఇది ఎక్కువగా మధ్యవయసులో ఉన్న వారికి మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు యువకుల్లో కూడా ఈ సమస్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు కారణాలేంటీ? నివారణ గురించి వివరాల్లోకి వెళితే..

మూత్రాశయం ఖాళీ అయిన తర్వాత మూత్రనాళంలో కొంత మూత్రం మిగిలిపోతుంది. సాధారణంగా పెల్విక్ ఫ్లోర్ కండరాలు దాన్ని పూర్తిగా బయటకు పంపిస్తాయి. కానీ ఆ కండరాలు బలహీనపడితే మూత్రం పూర్తిగా బయటకు రాక కొద్ది సేపటికి చుక్కలుగా బయటకు వస్తుంది. వైద్యులు తెలుపుతున్న ప్రకారం.. ప్రోస్టేట్ వాపు , పెల్విక్ ఫ్లోర్ కండరాల బలహీనత కారణంగా ఈ సమస్య వస్తుంది. అలాగే ఎక్కువసేపు కూర్చునే అలవాటు ఉన్నవారికి, వ్యాయామం సరిగ్గా చేయని వారికి ఈ సమస్యల కనిపించవచ్చని తెలుపుతున్నారు.

సాధారణంగా ఇటువంటి సమస్య మధ్య వయసులో ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వీటిలో జీర్ణశక్తి మందగించడం.. రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడం వంటివి ఉంటాయి. కానీ ప్రస్తుతం యువకుల్లోనూ ఈ సమస్య కనిపిస్తోంది. నేటి జీవనశైలిలో కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చోవడం.. శారీరక కదలికలు తగ్గిపోవడం, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు, ఒత్తిడి కారణంగా ఈ సమస్య కనిపిస్తోంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, డ్రైవర్లు, ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాల్లో ఉన్నవారిలో ఇది ఎక్కువగా ఉంటోంది.

ఇలా చుక్కలుగా మూత్రం రావడం తక్కువ స్థాయిలో ఉంటే పెద్దగా ప్రమాదకరం కాదు. కానీ ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇలాగే కాకుండా మూత్రంలో రక్తం కనిపించడం, మంట లేదా నొప్పి ఉండటం, మూత్రం బలహీనంగా రావడం, తరచూ మూత్రం పోవాలనిపించడం వంటి సమస్యలు Urinary tract infection లేదా ప్రోస్టేట్ సమస్యలకు సంకేతం కావచ్చని అంటున్నారు.

ఈ సమస్యల పరిష్కారానికి యూరినేషన్ తర్వాత కొద్దిసేపు ఆగి మళ్లీ ప్రయత్నించాలి. ఎక్కువసేపు కూర్చోకుండా మధ్య మధ్యలో నడవాలి. బరువు నియంత్రణలో ఉంచుతూ.. నీరు సరిపడా తాగాలి. లక్షణాలు తరచుగా ఉంటే Urology నిపుణుడిని సంప్రదించడం మంచిదని వైద్యులు తెలుపుతున్నారు. సరైన పరీక్షలతో అసలు కారణాన్ని తెలుసుకుని చికిత్స తీసుకుంటే సమస్యను నియంత్రించవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular