Corona Test: కరోనా సోకిందో లేదో నిమిషంలో గుర్తించవచ్చు.. ఎలా అంటే?

Corona Test: కరోనా వైరస్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఈ నెల తొలి వారం నుంచి కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండగా కొత్త వేరియంట్ లు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. గతంతో పోలిస్తే కరోనా మరణాల సంఖ్య తగ్గినా కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించడం సరి కాదని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. దగ్గు, జలుబు కరోనా ప్రధాన లక్షణాలు కాగా కరోనా వైరస్ కు సంబంధించి కొత్త లక్షణాలు […]

Written By: Navya, Updated On : January 22, 2022 2:29 pm
Follow us on

Corona Test: కరోనా వైరస్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఈ నెల తొలి వారం నుంచి కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండగా కొత్త వేరియంట్ లు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. గతంతో పోలిస్తే కరోనా మరణాల సంఖ్య తగ్గినా కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించడం సరి కాదని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. దగ్గు, జలుబు కరోనా ప్రధాన లక్షణాలు కాగా కరోనా వైరస్ కు సంబంధించి కొత్త లక్షణాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.

Corona Test

శాస్త్రవేత్తలు బూస్టర్ డోస్ కూడా తీసుకుంటే కరోనా నుంచి రక్షించుకోవచ్చని సూచనలు చేస్తుండటం గమనార్హం. మరోవైపు కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ఎక్కువ సమయం పడుతున్న సంగతి తెలిసిందే. యాంటీజెన్ పరీక్షలు చేయించుకుంటే అరగంటలో ఫలితం తేలిపోనుండగా ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయించుకుంటే మాత్రం ఫలితం తెలియడానికి ఒకరోజు నుంచి రెండు రోజుల సమయం పడుతోంది.

Also Read: మరో స్టార్ డైరెక్టర్ కి కరోనా.. ఇప్పుడు సినీ లోకమంతా కరోనా మయమే !

అయితే యూకే శాస్త్రవేత్తలు క్షణాల వ్యవధిలోనే కరోనా వైరస్ సోకిందో లేదో తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుండటం గమనార్హం. ఎక్స్​రే టెక్నిక్ తో కరోనా సోకిందో లేదో సులువుగా తెలుసుకోవచ్చని ఈ టెక్నిక్ ద్వారా 98 శాతం కచ్చితమైన ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. యూనివర్సిటీ ఆఫ్​ ది వెస్ట్​ స్కాట్లాండ్ ఈ టెక్నాలజీని డెవలప్ చేసిందని సమాచారం.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఆర్టీ పీసీఆర్ కు ప్రత్యామ్నాయం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తక్కువ రేడియేషన్ ను ఉపయోగించి కరోనా నిర్ధారణ చేయనున్నారని తెలుస్తోంది. కృత్రిమ మేధస్సును ఉపయోగించి కొత్త ఎక్స్ రే టెక్నిక్ ద్వారా ఈ ప్రయోగాలు చేయనున్నారని తెలుస్తోంది.

Also Read: విపరీతంగా పెరుగుతున్న కేసులు.. కొత్తగా ఎన్నంటే? దేశంలో థర్డ్ వేవ్ తప్పదా?