
దేశంలో సంవత్సరంసంవత్సరానికి షుగర్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చిరుధాన్యాలు తినడం ద్వారా టైప్ -2 డయాబెటిస్ సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు మిల్లెట్ ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా షుగర్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. ఇంటర్మీడియట్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ యాసిడ్ ట్రాపిక్ పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెల్లడించింది.
ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్ జర్నల్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి. ఈ జర్నల్ లో ప్రచురించిన పరిశోధనల ఫలితాలను బట్టి రక్తంలో చక్కెర లెవెల్స్ 12 నుంచి 15 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది. మిల్లెట్ యొక్క సగటు గ్లైసెమిక్ సూచిక 52.7 శాతం అని శాస్త్రవేత్తలు చెబుతుండగా గోధుమల కంటే ఇది 30 శాతం తక్కువ కావడం గమనార్హం. బియ్యం, గోధుమ, మొక్కజొన్న గ్లైసెమిక్ ఇండెక్స్ మిల్లెట్స్ కంటే ఎక్కువగా ఉంటుంది.
మిల్లెట్స్ మధుమేహంను నియంత్రించడంలో ఎంతగానో సహాయపడుతుంది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ నివేదిక ప్రకారం 1990 నుంచి 2006 మధ్య మధుమేహ బాధితుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో డయాబెటిస్ కేసులు పెరుగుతుండగా చైనా, అమెరికా, ఇండియాలో ఈ కేసులు ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత డయాబెటిస్ ను నివారించడానికి సులువైన మార్గం లేదని చెప్పారు.
ఆహారంలో మార్పులు చేయడంతో పాటు జీవనశైలిని మార్చుకోవడం ద్వారా మాత్రమే డయాబెటిస్ ను నియంత్రించడం సాధ్యమవుతుంది. సామాన్యులకు, ప్రభుత్వాలకు ఉపయోగకరకంగా ఆహారంలో మార్పులు చేయడం ద్వారా మాత్రమే దీనిని నియంత్రించవచ్చు.