
మనలో దాదాపు అందరూ బయటకు వెళ్లిన సమయంలో చెప్పులు ధరించి నడుస్తూ ఉంటారు. చెప్పులు లేకుండా నడిస్తే చాలామందికి సౌకర్యవంతంగా అనిపించదు. కొందరు ఒక జత చెప్పులను వాడుతూ ఒక్కోరోజూ ఒక్కో జత చెప్పులను వినియోగిస్తూ ఉంటారు. మరి కొంతమందికి ఇంట్లో ఉన్నా కాళ్లకు చెప్పులు తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే వైద్య నిపుణులు మాత్రం రోజులో కొంత సమయమైనా చెప్పులు లేకుండా నడవాలని సూచిస్తున్నారు.
మన పూర్వీకులు చెప్పులు వాడలేదనే సంగతి మనకు తెలిసిందే. చెప్పులు లేకుండా నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. రోజులో కొంత సమయమైనా చెప్పులు లేకుండా ఎవరైతే నడుస్తారో వాళ్ల పాదాలు స్ట్రాంగ్ గా ఉంటాయి. చెప్పులు లేకుండా నడవడం వల్ల మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. చెప్పులు లేకుండా నడిస్తే తొలుత నొప్పిగా అనిపించినా పాదాల సున్నితత్వం తొలగిపోయి పాదం యొక్క సామర్థ్యం సులభంగా పెరుగుతుంది.
సమీపంలో పార్కు ఉంటే పార్కులో చెప్పులు లేకుండా నడిస్తే మంచిది. బీచ్ లకు వెళ్లిన సమయంలో ఇసుకలో చెప్పులతో కంటే పాదాలతో నడిస్తే మంచిది. పాదాలతో రోజులో కొంత సమయమైనా నడిచే వాళ్లలో నడక స్థిరంగా ఉంటుందని.. చెప్పులు లేకుండా నడవడం వల్ల మోకాళ్ల సమస్యలతో పాటు వెన్ను నొప్పి సమస్యలు దూరమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చెప్పులు లేకుండా నడిస్తే ఒత్తిడి దూరమవుతుంది.
శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో చెప్పులు లేకుండా నడిచే వాళ్లలో నిద్ర నాణ్యత మెరుగుపడినట్టు తేలింది. చెప్పులు లేకుండా తిరిగితే రక్త ప్రసరణ మెరుగుపడటంతో పాటు గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి. కీళ్ల నొప్పుల సమస్యతో బాధ పడేవాళ్లు రోజులో కొంత సమయం చెప్పులు లేకుండా నడిస్తే మంచిది.