https://oktelugu.com/

తుమ్ములు త్వరగా తగ్గడానికి పాటించాల్సిన చిట్కాలివే..?

చలికాలం వచ్చిందంటే చాలు చాలామందిని తుమ్ములు, జలుబు సమస్యలు వేధిస్తూ ఉంటాయి. వరుసగా ఆగకుండా వచ్చే తుమ్ముల వల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు. దుమ్ము, ధూళి కారణంగా వచ్చే అలర్జీ వల్ల ఎక్కువ మంది ఈ సమస్య బారిన పడుతూ ఉంటారు. ముక్కులోని పొరలలో అలర్జీ మొదలైతే తుమ్ముల సమస్య వేధిస్తూ ఉంటుంది. తలకు వేసుకునే హెయిర్ డై, కెమికల్స్, పాత పుస్తకాలు, ఇతరత్రా వస్తువులు కూడా ఈ సమస్యకు కారణమవుతాయి. Also Read: ముఖంపై నల్ల […]

Written By: , Updated On : December 19, 2020 / 10:35 AM IST
Follow us on

Sneezing
చలికాలం వచ్చిందంటే చాలు చాలామందిని తుమ్ములు, జలుబు సమస్యలు వేధిస్తూ ఉంటాయి. వరుసగా ఆగకుండా వచ్చే తుమ్ముల వల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు. దుమ్ము, ధూళి కారణంగా వచ్చే అలర్జీ వల్ల ఎక్కువ మంది ఈ సమస్య బారిన పడుతూ ఉంటారు. ముక్కులోని పొరలలో అలర్జీ మొదలైతే తుమ్ముల సమస్య వేధిస్తూ ఉంటుంది. తలకు వేసుకునే హెయిర్ డై, కెమికల్స్, పాత పుస్తకాలు, ఇతరత్రా వస్తువులు కూడా ఈ సమస్యకు కారణమవుతాయి.

Also Read: ముఖంపై నల్ల మచ్చలు తొలగిపోవాలంటే పాటించాల్సిన చిట్కాలివే..?

తరచూ తుమ్ములు వస్తుంటే అలర్జీ కారకాలను గుర్తించి వీలైనంత దూరంగా ఉండాలి. వెల్లుల్లి రెబ్బలను పేస్ట్ లా చేసుకుని వాటి వాసనను పీల్చడం ద్వారా తుమ్ముల సమస్యకు చెక్ పెట్టవచ్చు. తుమ్ములకు చెక్ పెట్టడంలో అల్లం కూడా బాగా పని చేస్తుంది. రోజుకు మూడుసార్లు అల్లం రసాన్ని తీసుకోవడం ద్వారా తుమ్ముల సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. రోజుకు మూడుసార్లు అల్లం రసం తీసుకోవడం వల్ల కూడా తుమ్ముల సమస్యకు చెక్ పెట్టవచ్చు.

Also Read: ఫ్రిజ్ లో ఆహార పదార్థాలు ఉంచుతున్నారా.. చేయకూడని తప్పులివే..?

చమోమిలే టీ అలర్జీల వల్ల వచ్చే తుమ్ములను నివారించడంలో సహాయపడుతుంది. యాంటీ బ్యాక్టీరియా యాంటీ వైరస్ లక్షణాలను నివారించడంలో సోపు గింజలు సహాయపడతాయి. వేడి నీటిలో సోపు గింజల పొడిని వేసుకుని అలా తయారైన టీని తాగడం ద్వారా తుమ్ముల సమస్యకు చెక్ పెట్టవచ్చు. గోరువెచ్చని నీటిలో తులసి ఆకులను కలుపుకుని తాగినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి.

మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం

గృహ చిట్కాలు పాటించినా సమస్య వేధిస్తుంటే తరచూ మందులను వాడాలి. క్రమంగా అలర్జీకి సంబంధించిన మందులు వాడితే ఆస్తమా, సైనసైటిస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే వైద్య నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి.