Snoring: ఈ మధ్య గురక అనేది చాలామందికి అతి పెద్ద సమస్య అయిపోయింది. నిజానికి ఇది చాలా సాధారణమైన సమస్య. అయితే, ఇది బాధితున్నే కాకుండా, ఇతరుల్ని కూడా బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. భర్త గురక భరించలేక విడాకులు ఇచ్చిన భార్యలు ఉన్న సమాజం ఇది. కాబట్టి.. ఈ గురక సమస్యను తేలికగా తీసుకోలేం. అసలు గురక ఎలా వస్తోందో తెలుసా ? నిద్రలో గాలి పీల్చుకొంటున్నప్పుడు కొండనాలుకతో పాటు అంగిటిలోని మెత్తని భాగం కూడా అధిక ప్రకంపనలకు లోను అవుతుంది. అప్పుడు గురక ఎక్కువగా వస్తూ ఉంటుంది.
Also Read: ఈ సమయంలో ఇల్లు ఊడుస్తున్నారా అయితే ఏం జరుగుతుందో చూడండి?
ఇది నిద్ర పోతున్న సమయంలో సహజంగా ఎదుర్కొనే సమస్య. నిద్రించే సమయంలో వ్యక్తి శ్వాస పీల్చినప్పుడు , శ్వాసను నిద్రలో గట్టిగా తీసుకోవడంతో క్రమేణా అది గురకకు దారితీస్తుంది. అలాగే నిద్రించే సమయంలో నోరు, ముక్కు ద్వారా గాలి సులభంగా పోకపోవడం వల్ల కూడా గురక వస్తూ ఉంటుంది. మరి ఈ గురకకు ఎలా తగ్గించుకోవాలి అంటే.. ముందు స్థూలకాయాన్ని తగ్గించుకోవాలి.
అలాగే, గొంతు వాపు, ధూమపానం వంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక లావుగా ఉన్నవారు బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా నిద్రపోయేటప్పుడు పక్కకు తిరిగి పడుకోవాలి. అలా పడుకోవటం అలవాటు చేసుకుంటే.. గురక తగ్గుతుంది. అదే విధంగా నీటి ఆవిరిలో యూకలిప్టస్ తైలాన్ని వేసి ఆవిరి పడి తే శ్వాస మార్గాలు తెరుచుకొని గురక తగ్గుతుంది. గురక తగ్గడానికి ఆవిరి పట్టడం అనేది మంచి హోం రెమెడీ. ఇది అందరూ ట్రై చెయ్యొచ్చు.
Also Read: నడుము నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ జాగ్రత్తలతో సమస్యలకు చెక్!