Tips to Sleep Better at Night: ఇప్పుడున్న కాలంలో చేతిలో మొబైల్ లేకుండా ఎవరు ముందుకు సాగడం లేదు. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ మొబైల్ తోనే గడుపుతున్నారు. మనసుల మధ్య దూరాలు చెరిగిపోయి ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. ఫోన్ వాడడం వల్ల ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూలన జరిగే ప్రతి విషయం ఫోన్ ద్వారా తెలిసిపోతుంది. అలాగే మొబైల్ తో కొందరు ఉపాధిని కూడా పొందుతున్నారు. మరికొందరు లక్షల వ్యాపారం కూడా చేస్తున్నారు. ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో అన్ని నష్టాలు ఉన్నాయని కొందరు అయితే నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిల్లో ఫోన్ వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. రాత్రి సమయంలో మొబైల్ వాడే వారికి ఈ సమస్య వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదేంటంటే?
మనిషి ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం మాత్రమే కాకుండా కంటి నిండా నిద్ర కూడా ఉండాలి. కానీ ప్రస్తుత కాలంలో మొబైల్ చేతికి వచ్చిన తర్వాత రాత్రులు ఏదో ఒక వీడియోను చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇలా రాత్రిళ్ళు మెలకువ ఉండడంతో నిద్రకు భంగం కలుగుతుంది. అంతేకాకుండా రాత్రి మొబైల్ చూసే వారిలో Melaton అనే హార్మోన్ 50% ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ కావడంతో నిద్రకు భంగం కలుగుతుంది. కొన్ని రోజుల తర్వాత అదే సమయానికి నిద్ర పోవడానికి శరీరం సహకరించదు. అలా రాత్రిళ్ళు మెలకువతో ఉండడం వల్ల మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Also Read: తోడు కోసం ఐదు పదుల వయసులో పెళ్లి.. భర్త చేసిన పనితో భార్యకు షాక్!
కొన్నాళ్లపాటు ఇలా ఇబ్బందులు పడిన తర్వాత తీవ్ర ఆవేదనకు గురవుతారు. ఏ పని మొదలుపెట్టిన అలసటతో ఉంటారు. ముఖ్యంగా ఆడవారిలో నీరసం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పని చేయాలంటే మనసు యాక్టివ్ గా ఉండదు. మొబైల్ చూసినంత సేపు బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత మెదడులో వ్యతిరేక ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనల కారణంగా ఎదుటివారితో సరిగా మాట్లాడే విధంగా సహకరించదు.
అయితే ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నిద్రపోయే రెండు గంటల ముందే మొబైల్ ను ఆఫ్ చేయాలి. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ లేదా కామ్ గా కూర్చొని ధ్యానం చేసుకుంటూ నిద్రపోవాలి. అయితే కొన్ని రోజులపాటు మొబైల్ చూసిన వారికి ఈ సమస్య ఉండవచ్చు. కానీ ఇప్పటినుంచే ఈ పద్ధతిని మార్చుకోవడం ద్వారా సరైన నిద్ర పోయే అవకాశం ఉంటుంది. సమస్య నుంచి బయటపడడానికి కొన్ని రోజులు పట్టవచ్చు. అయినా మొబైల్ చూడడం మానడం అలవాటు చేసుకోవాలి. మీరు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఈ అలవాటు చేయడం ద్వారా అందరూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. లేకుంటే మానసిక సమస్యల నుంచి అల్జీమర్ సమస్య వచ్చి మతిమరుపు కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.