చిన్నారుల్లో ఇమ్యూనిటీ పెరగాలా.. తీసుకోవాల్సిన ఆహారాలివే..?

దేశంలో కరోనా మహమ్మారి శాస్త్రవేత్తల, వైద్యుల అంచనాలను మించి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. చిన్నారులు కరోనా బారిన పడే అవకాశం ఉందని వస్తున్న వార్తలు ప్రజలను తెగ టెన్షన్ పెడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహారం తీసుకోవడం ద్వారా మాత్రమే చిన్నారులు కరోనా బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా చిన్నారులకు కరోనా సోకకుండా కాపాడుకోవచ్చు. సరైన పోషకాహారం తీసుకోని పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. చిన్నారుల […]

Written By: Kusuma Aggunna, Updated On : May 25, 2021 8:14 am
Follow us on

దేశంలో కరోనా మహమ్మారి శాస్త్రవేత్తల, వైద్యుల అంచనాలను మించి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. చిన్నారులు కరోనా బారిన పడే అవకాశం ఉందని వస్తున్న వార్తలు ప్రజలను తెగ టెన్షన్ పెడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహారం తీసుకోవడం ద్వారా మాత్రమే చిన్నారులు కరోనా బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా చిన్నారులకు కరోనా సోకకుండా కాపాడుకోవచ్చు.

సరైన పోషకాహారం తీసుకోని పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. చిన్నారుల ఆహారంలో గుడ్లు, పండ్లు, పాలు, ఆకుకూరలు, కూరగాయలుమ్ నట్స్ ఉండేలా చూసుకోవడం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. వైవిధ్యంతో ఉన్న ఆహారం పిల్లలకు పెట్టడం ద్వారా పిల్లలకు వైరస్ బారిన పడినా త్వరగా కోలుకునే శక్తిసామర్థ్యాలు పెరుగుతాయి. ప్రధానంగా జింక్, ఐరన్, క్యాల్షియం, మాంసకృత్తులు, ఖనిజాలు ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో తోడ్పడతాయి.

శరీరానికి అవసరమైన మాంసకృత్తులు పాలు, పెరుగు, గుడ్డు, వేరుశనగల ద్వారా లభిస్తాయి. విటమిన్ సి లభ్యమయ్యే సెనగలు, గోంగూర, పుదీనా, పాలకూర, రొయ్యలు, మాంసం, గసగసాలు, నువ్వులు పిల్లలకు తినిపిస్తే మంచిది. ఆహారంలో నిమ్మ రసం చేర్చడం ద్వారా పిల్లలకు అవసరమైన సి విటమిన్ లభిస్తుంది. శరీరానికి అవసరమైన ఇనుము లభిస్తే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.

పచ్చసొన, నెయ్యి, కాలేయం, బటర్ ద్వారా శరీరానికి అవసరమైన డి విటమిన్ దొరుకుతుంది. శరీరానికి తగినంత ఎండ తగేలేలా చూస్తుకున్నా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. సరైన ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం ద్వారా పిల్లలు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవచ్చు.