https://oktelugu.com/

చలికాలంలో ఒంటినొప్పులకు చెక్ పెట్టే చిట్కాలివే..?

చలికాలంలో మనలో చాలామందిని ఒంటినొప్పులు వేధిస్తూ ఉంటాయి. ఆరోగ్య సమస్య చిన్నదే అయినప్పటికీ ఈ కాలంలో చిన్న దెబ్బ తగిలినా చాలా సమయం నొప్పిగా ఉంటుంది. దెబ్బ తగిలితే వాపు రావడంతో పాటు నొప్పి ఎంత సమయమైనా తగ్గకుండా ఉండటం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే కొన్ని వంటింటి చిట్కాలను పాటించడం ద్వారా చలికాలంలో ఒంటినొప్పులకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. చలికాలంలో ఒళ్లు నొప్పులకు చెక్ పెట్టడంలో అల్లం అద్భుతంగా పని చేస్తుంది. బాగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 9, 2021 7:01 pm
    Follow us on

    చలికాలంలో మనలో చాలామందిని ఒంటినొప్పులు వేధిస్తూ ఉంటాయి. ఆరోగ్య సమస్య చిన్నదే అయినప్పటికీ ఈ కాలంలో చిన్న దెబ్బ తగిలినా చాలా సమయం నొప్పిగా ఉంటుంది. దెబ్బ తగిలితే వాపు రావడంతో పాటు నొప్పి ఎంత సమయమైనా తగ్గకుండా ఉండటం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే కొన్ని వంటింటి చిట్కాలను పాటించడం ద్వారా చలికాలంలో ఒంటినొప్పులకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.

    చలికాలంలో ఒళ్లు నొప్పులకు చెక్ పెట్టడంలో అల్లం అద్భుతంగా పని చేస్తుంది. బాగా గ్రైండ్ చేసిన అల్లాన్ని వస్త్రంలో ఉంచి ఆ తరువాత వస్త్రంతో పాటు అల్లాన్ని వేడినీళ్లలో పెట్టాలి. అనంతరం వస్త్రాన్ని తీసుకుని వాపు లేదా గాయం అయిన చోట ఉంచితే సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఒంటినొప్పులు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధ పడేవాళ్లు రాత్రి సమయంలో గోరువెచ్చని పాలలో పసుపు కలుపుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది.

    రోజూ రాత్రి సమయంలో పసుపు పాలను తాగడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా సులభంగా చెక్ పెట్టవచ్చు. పాలలో దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగితే ఒళ్లునొప్పులకు సులువుగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. దాల్చిన చెక్క కీళ్ల నొప్పులతో పాటు వాపును సైతం సులభంగా తగ్గిస్తుంది. అర్థరైటిస్ సమస్యతో బాధ పడేవాళ్లు సైతం దాల్చినచెక్క పొడి ఉన్న పాలు తాగితే మంచిది.

    యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ సైతం ఒళ్లు నొప్పులకు సులభంగా చెక్ పెడుతుంది. వేడి నీళ్లలో యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ వేసి స్నానం చేయడం వల్ల ఒళ్లునొప్పులకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. ఈ చిట్కాలు పాటించడం ద్వారా చలికాలంలో ఒళ్లునొప్పులకు సులభంగా చెక్ పెట్టవచ్చు.