https://oktelugu.com/

చూయింగ్‌ గమ్‌తో బరువు సులువుగా తగ్గే ఛాన్స్.. ఎలా అంటే..?

ఈ మధ్య కాలంలో అధిక బరువు సమస్యతో బాధ పడేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే చూయింగ్ గమ్ తో సులభంగా అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు. చూయింగ్ గమ్ ను ఆకలిగా ఉన్నవారు తింటే ఆకలి తగ్గుతుందని బరువు తగ్గడానికి చూయింగ్ గమ్ సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గతంలో కొన్ని పరిశోధనల్లో చూయింగ్ గమ్ తో ఒత్తిడికి చెక్ పెట్టవచ్చని తేలింది. తరచూ ఏదో ఒక విషయం గురించి ఆలోచించే వారు చూయింగ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 9, 2021 / 07:29 PM IST
    Follow us on

    ఈ మధ్య కాలంలో అధిక బరువు సమస్యతో బాధ పడేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే చూయింగ్ గమ్ తో సులభంగా అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు. చూయింగ్ గమ్ ను ఆకలిగా ఉన్నవారు తింటే ఆకలి తగ్గుతుందని బరువు తగ్గడానికి చూయింగ్ గమ్ సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గతంలో కొన్ని పరిశోధనల్లో చూయింగ్ గమ్ తో ఒత్తిడికి చెక్ పెట్టవచ్చని తేలింది.

    తరచూ ఏదో ఒక విషయం గురించి ఆలోచించే వారు చూయింగ్ గమ్ ను నమలడం వల్ల సులభంగా ఆందోళన, ఒత్తిడిలను తగ్గించుకోగలుగుతారు. 15 సంవత్సరాల క్రితం శాస్త్రవేత్తలు చూయింగ్ గమ్ గురించి చేసిన పరిశోధనల్లో మెదడు పనితీరును మెరుగుపరచడంలో చూయింగ్ గమ్ సహాయపడుతుందని వెల్లడైంది. ఎక్కువగా చూయింగ్ గమ్ ను తినేవారు ఏకాగ్రతతో పని చేస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    ఎక్కువగా చూయింగ్ గమ్ ను తినే వారు ఆహారం తక్కువగా తీసుకుంటారని ఫలితంగా శరీరంలో కేలరీలు తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కేలరీలు అందడం తగ్గే కొద్దీ బరువు సులభంగా తగ్గే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. బరువు ఎక్కువగా ఉన్నవారు చూయింగ్ గమ్ ను ఎక్కువగా తీసుకుంటే మంచిది. శాస్త్రవేత్తలు చూయింగ్ గమ్ కు సంబంధించి పూర్తిస్థాయిలో పరిశోధనలు చేస్తున్నారు.

    చూయింగ్ గమ్ ద్వారా బరువు తగ్గాలని అనుకునే వారు ఆకలి వేసే సమయంలో చూయింగ్ గమ్ ను తింటే మంచిది. తరచూ వ్యాయామాలు చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సులభంగా అధిక బరువు సమస్యకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.