Tea: ఆయుర్వేదంలో మనకు ఎన్నో రకాల వ్యాధులకు మందులు ఉన్నాయి. దీంతో వాటితో మనకు ఉన్న వ్యాధులను దూరం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మనకు ఆంగ్లేయులు అలవాటు చేసిన పనికి రాని టీని తాగేందుకు అందరు మొగ్గు చూపుతున్నారు. కానీ అందులో ఒక శాతం కూడా ప్రొటీన్లు ఉండటం లేదు. ఇంకా జంక్ ఫుడ్స్ తింటున్నాం. దాని వల్ల కూడా మనకు ఇబ్బందులు వస్తున్నాయి. ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల కాలుష్యం, టాక్సిన్సు, నిద్రలేమి వంటి రోగాలకు కారణమవుతున్నాయి. ఆరోగ్యకరమైన పానీయం తీసుకోవడం మంచిది.
ప్రతి రోజు మన ఆహారంలో ఏవేవో తీసుకుంటున్నాం. పనికి రాని వాటిని తింటూ అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నాం. మన ఇంట్లోనే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే వస్తువులు ఉన్నాయని తెలుసుకోవడం లేదు. పనికి రాని చెత్త తినడంతో మన పొట్టంతా కాలుష్యంగా మారిపోతోంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఒక టేబుల్ చెంచా ధనియాలు, ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర, ఒక స్పూన్ వాము ను ఒక గ్లాసులో వేసి నీరు పోసి రాత్రంతా నానబెట్టాలి. దీంతో అందులో ఉండే పోషకాలు నీటిలోకి మారుతాయి.
ఉదయం పూట లేచిన తరువాత ఆ నీటిని మరిగించాలి. గ్లాసు నీరు అర గ్లాసు అయ్యేంత వరకు వేడి చేయాలి. తరువాత దాన్ని వడకట్టాలి. అందులో రుచి కోసం కొంచెం బెల్లం చేర్చుకుంటే మంచిదే. ఆ నీటిని తాగడం వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ధనియాలు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. ఇక జీలకర్ర మనం తిన్న ఆహారాలు జీర్ణం చేయడానికి దోహదపడుతుంది. వాము కూడా మనకు కడుపులో ఉండే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెడుతుంది.
ఈ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల కడుపులో ఉండే దాదాపు నలభై రకాల రోగాలకు ఉపశమనంగా ఉంటుంది. కిడ్నీల సమస్యలతో బాధపడే వారికి కూడా తోడ్పడుతుంది. యూరిన్ లో సమస్యలున్నా తీసేస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలున్నా నయం చేస్తుంది. ఈ టీని అన్ని వయసుల వారు తీసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల రోగాలకు చెక్ పెడుతుంది. ఈ టీని తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: Chiranjeevi- Rajamouli: చిరంజీవి చేసిన పనికి డిస్సపాయింట్ అయిన రాజమౌళి చరణ్ తో అలా చేయించారా!