ఒత్తిడి నుంచి బయటపడేందుకు పాటించాల్సిన జాగ్రత్తలివే..?

దేశంలో చాలామంది ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడం వల్ల, అదే పనిగా సమస్యల గురించి ఆలోచించడం వల్ల, డబ్బు వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అయితే మానసిక ఒత్తిడి వల్ల రోజూవారి పనులను అనుకున్న విధంగా పూర్తి చేయలేకపోవడంతో పాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడి నుంచి సులభంగా బయటపడటం సాధ్యమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. Also Read: చిన్నారులపై ఆన్ లైన్ క్లాసుల ప్రభావం.. విద్యార్థులలో […]

Written By: Navya, Updated On : January 5, 2021 1:22 pm
Follow us on

దేశంలో చాలామంది ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడం వల్ల, అదే పనిగా సమస్యల గురించి ఆలోచించడం వల్ల, డబ్బు వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అయితే మానసిక ఒత్తిడి వల్ల రోజూవారి పనులను అనుకున్న విధంగా పూర్తి చేయలేకపోవడంతో పాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడి నుంచి సులభంగా బయటపడటం సాధ్యమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: చిన్నారులపై ఆన్ లైన్ క్లాసుల ప్రభావం.. విద్యార్థులలో ఆ సమస్యలు..?

ఒత్తిడి పెరుగుతోందని అనిపిస్తే మొదట ఒత్తిడి పెరగడానికి గల కారణాలను తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మన ప్రవర్తనే ఒత్తిడి పెరగడానికి కారణమవుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుని సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మనకు సన్నిహితంగా మెలిగే వారితో సమస్యలను పంచుకోవడంతో పాటు వీలైనంత వరకు ఎమోషన్ ను తగ్గించుకోవాలి.

Also Read: దంతాలు పుచ్చిపోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?

ఏ పనినైనా ఆలస్యం కాకుండా ముందుగానే పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఎప్పుడూ సానుకూలంగా ఆలోచిస్తూ చేయగలిగే పనులపై దృష్టి పెట్టాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం ద్వారా ఒత్తిడి సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించి మందుల ద్వారా ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. నిద్ర, ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడికి చెక్ పెట్టవచ్చు.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

ఇష్టమైన పాటలు వినడం, పనులు చేయడం, అభిరుచులను కొనసాగించడం ద్వారా ఒత్తిడికి సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. ఒత్తిడి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం మన జీవితంపై ఒత్తిడి ప్రభావం పడే అవకాశం ఉంటుంది.