Raw Onion side effects: ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలోనే అనేక రకాల పోషకాలు ఉంటాయి. కేవలం అన్నం మాత్రమే తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇందులో కలుపుకునే కూరలో ఉపయోగించే పదార్థాలతో శరీరంలోకి పోషకాలు వెళుతూ ఉంటాయి. అయితే ప్రతిరోజు వన్డే కూరలో ఉల్లిపాయలు తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. ఉల్లిపాయలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఉల్లిపాయలు 40 కేలరీల శక్తి ఉంటుంది. ఇది 89% నీటి కంటెంట్ ను కలిగి ఉంటుంది. అలాగే 9.3 గ్రాముల కార్బోహైడ్రేట్లు, వన్ పాయింట్ సెవెన్ గ్రాముల ఫైబర్, 1.1 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇలాంటి ప్రయోజనాలు ఉన్న ఉల్లిపాయను కూరలో కాకుండా నేరుగా కూడా తీసుకోవచ్చు. అయితే కొంతమంది పచ్చి ఉల్లిపాయను ఎక్కువగా తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల నష్టాలు ఉన్నాయని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవి ఎలాంటి నష్టాలు ఇప్పుడు చూద్దాం..
వాస్తవానికి ఉల్లిపాయలు తినడం వల్ల శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయలో క్వెర్సిటిన్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె సమస్యలను రాకుండా కాపాడుతూ ఉంటుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయలు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల రక్తంలో ఇన్సులిన్ ను స్థిరంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఉల్లిపాయలో విటమిన్ సి సల్ఫర్ పదార్థాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల జీర్ణక్రియను పెంచుతాయి. దగ్గు, జలుబు సమస్యతో వాడేవారు ఉల్లిపాయ వాసన చూసినా ఫలితం ఉంటుంది. అలాగే చర్మం కాంతివంతంగా ఉండడానికి.. జుట్టు పెరగడానికి ఉల్లిపాయ తినడం అవసరం. కొన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను ఇవి నిరోధిస్తాయి.
అయితే అతి ఏది అయినా మంచిది కాదు అన్నట్లు.. ఉల్లిపాయలు ఎక్కువగా తినడం ఏమాత్రం మంచిది కాదు అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పచ్చి ఉల్లిపాయలు ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలా తిన్న తర్వాత వీరికి కడుపు ఉబ్బరం లేదా కడుపు బరువుగా అనిపించడం వంటివి ఉంటాయి. అలాగే పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల రోజంతా నోరు దుర్వాసనగా వస్తుంది. ఇలాంటి సమయంలో ఎదుటివారితో మాట్లాడితే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. రాత్రి పడుకునే ముందు పచ్చి ఉల్లిపాయలు తిన్నవారిలో గుండెలో మంట వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరిలో ఇవి అలర్జీని ఏర్పరుస్తాయి. చర్మ సమస్యలతో పాటు కళ్ళు, ముక్కు వంటి అవయవాల్లో నీరు కారణం ఉంటుంది.
ఉల్లిపాయ తినడం వల్ల రక్తంలోని ఇన్సులిన్ ను స్థిరంగా ఉంచుతుంది. కానీ అతిగా తినడం వల్ల రక్తంలో పల్చగా చేస్తుంది. ప్రత్యేకమైన మెడిసిన్ వాడేవారు ఉల్లిపాయను మోతాదుకు మించి తీసుకోకూడదు. ఒకవేళ ఉల్లిపాయలు తీసుకోవాలని అనిపిస్తే వాటిని ఉడికించి లేదా ఫ్రై చేసి తీసుకోవాలి. అలా చేస్తే జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.