Homeవార్త విశ్లేషణPeriods : పీరియడ్స్ రావట్లేదా.. అయితే కారణం ఇదే

Periods : పీరియడ్స్ రావట్లేదా.. అయితే కారణం ఇదే

Periods : సాధారణంగా పీరియడ్స్ అనేవి అమ్మాయిలకు ప్రతీ నెల వస్తుంటాయి. కేవలం గర్భం దాల్చినప్పుడు మాత్రమే నెలసరి ఆగుతుంది. లేదా వయస్సు పెరిగిన తర్వాత మోనోపాజ్ దశ వచ్చినప్పుడు పూర్తిగా ఆగిపోతాయి. కొందరికి అనారోగ్య సమస్యల వల్ల కొన్నిసార్లు ఆగుతుంది. ఒక్కోరి బాడీ, తీసుకునే ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల కొందరికి నెలసరి ఆగుతుంది. నెలసరి అనేది సరైన సమయానికి రాకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది. ప్రతీ నెల రాకుండా ఒక్క నెల దాటిన కూడా సమస్యలు తప్పవు. అయితే కొందరు తెలియక కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల నెలసరి ఆలస్యం అవుతుంది. డైలీ తీసుకునే ఆహారం మీదనే నెలసరి వస్తుందా? రాదా? అనేది ఆధారపడి ఉంటుంది. కొందరికి తెలియక జింక్‌ ఉండే పదార్థాలను అధికంగా తీసుకుంటారు. శరీరానికి జింక్ ఎక్కువగా అయిన కూడా పీరియడ్స్ సరైన సమయానికి రావు. ఆరోగ్యానికి జింక్ మంచిదే. కానీ రోజుకి 14 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువగా జింక్ తీసుకుంటే అండం విడుదల కావడం కష్టం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి జింక్ ఉండే పదార్థాలను అధికంగా తీసుకోవద్దు.

మద్యం ఎక్కువగా సేవించడం, శారీరక వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా నెలసరి సమస్యలు వస్తాయి. వీటివల్లే కొందరు నెలసరి సమయంలో పొత్తి కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నొప్పిని తట్టుకోవడానికి సహజంగా చిట్కాలు పాటిస్తే పర్లేదు. కానీ మందులు వాడటం ఆరోగ్యానికి అంతమంచిది కాదు. నెలసరి సమస్యల నుంచి విముక్తి చెందాలంటే యోగా, మెడిటేషన్‌తో పాటు వాకింగ్ చేయాలి. అలాగే విటమిన్-బి6, విటమిన్-సి, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం ఫైబర్ ఉండే వాటిని తీసుకోవాలి. వీటివల్ల నెలసరి నొప్పి తగ్గడంతోపాటు సరైన సమయానికి పీరియడ్స్ వస్తాయి. సరైన టైంకి పీరియడ్స్ కావాలంటే.. ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, 10నిమిషాల పాటు మరగబెట్టి, చల్లార్చి వడపోసుకోవాలి. ఇలా చేసిన తర్వాత అవసరమైతే ఇందులో బెల్లం కలపాలి. దీన్ని మూడు వారాలకి ఒకసారి తయారు చేసుకుని తాగితే నెలసరి సరైన సమయానికి వస్తుంది. అలాగే నెలరోజుల పాటు మెంతి ఆకును కూరగా చేసి తింటే పీరియడ్స్ సరైన టైంకు వస్తుంది. దాల్చిన చెక్కను పొడి చేసి, గోరువెచ్చని పాలలో కలిపి తాగితే రెగ్యులర్ పీరియడ్స్ అవుతారు. ఈ చిట్కాలు పాటించిన కూడా సరైన సమయానికి తప్పకుండా పీరియడ్స్ అవుతారు. మద్యం, ధూమపానం ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు చేస్తున్నారు. వీటి వల్ల కూడా నెలసరి సరైన సమయానికి రాదు. ఈ సమస్య ఉంటే పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లకు కాస్త దూరంగా ఉండటం మంచిది. దీనివల్ల నెలసరి సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.

 

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version