Ginger Health Benefits: అల్లంలో గొప్ప జాతికి చెందిన క్షార గుణం ఉంది. అందుకే, అల్లం దుంప కారంతో కూడిన ఘాటయిన రుచి కలిగి ఉంటుంది. ఎక్కువ వేడి చేసే గుణం కూడా అల్లానికి ఉంది. పైగా అల్లం అంటేనే ఎన్నో సమస్యలకు సరైన సమాధానం. ఇక అల్లాన్ని ఎండబెడితే శోంఠి అవుతుంది. ఎక్కువ కాలం నిలవ ఉండే ఈ శోంఠి కూడా అల్లం గుణాలని కలిగి ఉండటంతో పాటు గొంతుకు సంబంధించిన ఎన్నో ధీర్ఘకాలిక రోగాలను కూడా చాలా ఈజీగా నయం చేయగలదు.
మరి ముందుగా అల్లం ఉపయోగాలు తెలుసుకుందాం.
అల్లం జీర్ణశక్తిని చాలా బాగా కలిగిస్తుంది. అదేవిధంగా అరుచిని కూడా వెంటనే పోగొడుతుంది.
మీకు తెలుసా ? అల్లం కఫాన్ని పోగొడుతుంది.
అలాగే మనిషిలో మంచి చురుకుదనాన్ని కూడా అల్లం కలిగిస్తుంది.
ముఖ్యంగా ఈ అల్లం పైత్యాన్ని బాగా తగ్గిస్తుంది.
ఇక చక్కర కలిపి అల్లం మురబ్బా తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
అల్లం రసం వంటాముదం కలిపి కాచిన మిశ్రమాన్ని పరగడుపున ఉదయం చిన్నకప్పు అంటే 20 నుంచి 30 ml తాగితే చాలు. లోపల పేగులు కూడా చాలా గొప్పగా శుద్ధి అవుతాయి. అలాగే ఆకలి పుడుతుంది. నోటి అరుచి తొలగి పోతుంది.
Also Read: కేసీఆర్ ప్రెస్ మీట్ ఎందుకు రద్దు చేసుకున్నాడు? కారణం అదేనా?
ఇక ఎప్పుడైనా కడుపులో పసరు పెరిగి, నోటిలో నీళ్ళువూరుతూ వాంతులయినప్పుడు.. అల్లం ముక్కలు ఉప్పు కలిపి తింటే కడుపులో పసరును విరిచేసి వాతాన్ని బాగా తగ్గిస్తుంది. అలాగే ఇది జీర్ణశక్తిని కూడా బాగా పెంచుతుంది.
అదేవిధంగా ప్రతి ఉదయం చిన్న అల్లం ముక్కను ఉప్పుతో కలిపి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
జలుబు చేసి కఫం చేరి దగ్గు వస్తున్నప్పుడు చిన్న అల్లం ముక్కను దంచి పాలలో వేసి కాచి తాగినా వెంటనే దగ్గు తగ్గిపోతుంది.
Also Read: షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయిన ‘పవర్ స్టార్’ సినిమాలు..!