Best high protein food: మానవ శరీరం ఆరోగ్యంగా ఉండడానికి రోజు తినే ఆహారంతో పాటు అదనంగా కొన్ని ప్రోటీన్లు కలిగిన పదార్థాలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే చాలామంది నేటి కాలంలో ప్రోటీన్లు అనగానే మాంసకృతులు, ప్రాసెస్ ఫుడ్, బేకింగ్ ఫుడ్ వంటివి తీసుకుంటూ ఉంటున్నారు. వీటివల్ల శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోవడమే కాకుండా ఎలాంటి ఎనర్జీ రాదని కొంతమంది ఆరోగ్య నిపుణులు ఇప్పటికే సలహా ఇస్తున్నారు. ఇలాంటి వాటి స్థానంలో కొన్ని రకాల బీన్స్ చేర్చుకోవడం వల్ల శరీరానికి అదనపు ప్రోటీన్లు ఇవ్వడంతో పాటు అనారోగ్యానికి గురికాకుండా ఉండగలుగుతారని అంటున్నారు. అసలు ఎలాంటి బీన్స్ లో ఎలాంటి ప్రోటీన్లు ఉంటాయి? వీటిని ఎంత తీసుకోవడం శరీరానికి మంచిది?
కాలం మారుతున్న కొద్దీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా శరీరానికి అదనపు ప్రోటీన్లు అందిస్తేనే ఎలాంటి రోగాలనైనా తట్టుకునే శక్తి వస్తుంది. ఇలాంటి సమయంలో అత్యధిక ప్రోటీన్లు కలిగిన బీన్స్ ను తీసుకోవడం చాలా మంచిది అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో కొన్ని ప్రత్యేకమైన వాటిని తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. వీటిలో సోయాబీన్స్ ఒకటి. ప్రతి 100 గ్రాముల సోయాబీన్స్ లో 36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది వృక్ష ఆధారితా సంబంధించినది అయినందువల్ల ఇందులో అమినో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో ఉపకరిస్తాయి. అలాగే కిడ్నీ బీన్స్ కూడా హెల్త్ కు మంచిదే. ఇవి 100 గ్రాముల బీన్స్ లో 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణ క్రియ సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. 100 గ్రాముల బ్లాక్ బీన్స్ లో 21 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించే అవకాశం ఉంటాయి.
శనగలు గురించి అందరికీ తెలిసిందే. వీటిని 100 గ్రాములు తీసుకుంటే 19 గ్రాముల ప్రోటీన్ శరీరానికి ఇచ్చిన వారవుతారు. మాంసకృతులు తినలేని వారు శనగలను తీసుకోవడం ఎంతో మంచిది అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పింటో బీన్స్ 100 గ్రాముల్లో 21 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. జీరక్రియ సమస్యలతో బాధపడే వారికి ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలాగే లెంటిల్ లేదా కందిపప్పు వంటి 100 గ్రాముల దినుసుల్లో 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇవి బాయిల్డ్ చేసిన తర్వాత తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది.
అయితే చాలామంది వీటిని ఇష్టం లేకపోయినా క్రమ పద్ధతిలో తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల శరీరంలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కండరాల నిర్మాణం కోసం ఇవి ఉపకరిస్తాయి. వ్యాయామం చేసేవారు వీటిని తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది. బరువు తగ్గాలని అనుకునే వారికి వీటిని తినడం వల్ల అదనపు ఆహారం తీసుకోవాలని అనిపించదు. పైగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. గుండె సమస్యల నుంచి బయటపడతారు.