Cooking Oil : కొలెస్ట్రాల్ (కొవ్వు)లేని బెస్ట్ వంటనూనె ఇదే

Cooking Oil : ప్రస్తుత రోజుల్లో అందరు నూనె లేనిదే కూరలు చేయడం లేదు. వంటల్లో నూనెల వినియోగం పెరిగిపోతోంది. దీంతో జబ్బులకు ఆస్కారం ఏర్పడుతోంది. ఇటీవల కాలంలో ఎక్కువ మంది గుండె జబ్బులతో కుప్పకూలిపోతున్నారు. పట్టుమని పాతికేళ్లు కూడా లేని వ్యక్తులు గుండెపోటుతో మృతి చెందుతున్నారు. దీనికి కారణాలు ఏంటని ఆరా తీస్తే ఉప్పు, నూనెలే కారణాలుగా తెలుస్తోంది. దీంతో వాటి వినియోగం తగ్గించాలని ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కొవ్వులు లేని […]

Written By: Srinivas, Updated On : March 17, 2023 6:03 pm
Follow us on

Cooking Oil : ప్రస్తుత రోజుల్లో అందరు నూనె లేనిదే కూరలు చేయడం లేదు. వంటల్లో నూనెల వినియోగం పెరిగిపోతోంది. దీంతో జబ్బులకు ఆస్కారం ఏర్పడుతోంది. ఇటీవల కాలంలో ఎక్కువ మంది గుండె జబ్బులతో కుప్పకూలిపోతున్నారు. పట్టుమని పాతికేళ్లు కూడా లేని వ్యక్తులు గుండెపోటుతో మృతి చెందుతున్నారు. దీనికి కారణాలు ఏంటని ఆరా తీస్తే ఉప్పు, నూనెలే కారణాలుగా తెలుస్తోంది. దీంతో వాటి వినియోగం తగ్గించాలని ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కొవ్వులు లేని నూనెలు అంటూ లేవు.

గతంలో..

పూర్వం రోజుల్లో గానుగ మీద ఆడించే వారు. పల్లీలు, నువ్వులు స్వచ్ఛమైనవి తీసుకుని వాటిని నూనెగా తీసుకునే వారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. ఇప్పుడు రిఫైండ్ పేరుతో నూనెలు విచ్చలవిడిగా బయటకు వస్తున్నాయి. మా నూనె మంచిదంటే నూనె స్వచ్ఛమైనవని అందరు చెబుతున్నారు. కానీ అన్నింట్లో కల్తీలే మనకు కనిపిస్తాయి. కానీ వాటిని తమ బ్రాండ్లుగా నమ్మిస్తూ కాలం గడుపుకుంటున్నారు. దీంతో మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

స్వచ్ఛత అంటే..

ఒక కిలో నూనె తయారు కావాలంటే సుమారు రెండు కిలోల గింజలు అయితేనే సరిపోతోంది. కానీ మనకు మార్కెట్లో రూ. 150 నుంచి 170 మధ్య పల్లి, సన్ ప్లవర్ నూనెలు లభిస్తున్నాయి. ఇందులో స్వచ్ఛత ఎంత? వాటిని తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులొస్తాయి? అనే వాటిపై ఎవరు శ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా మనకు జబ్బులు రావడానికి కారణమవుతున్నాం. గతంలో పల్లి నూనె మనకు స్వచ్ఛంగా లభించేది. కానీ ఇప్పుడు గానుగలు అంతరించిపోయాయి. ప్యాకెట్లు మనకు నష్టాలే తెస్తున్నాయి.

ఇప్పుడు ఆలివ్ ఆయిల్

ప్రస్తుతం చాలా మంది ఆలివ్ , రైస్ బ్రాండ్ ఆయిళ్లు ఎక్కువగా వాడుతున్నారు. ఇవి మంచివని నమ్ముతున్నారు. కానీ వాటి వల్ల కూడా మన ఆరోగ్యానికి ఇబ్బందులే. మంతెన సత్యనారాయణ రాజు చెప్పిన ఆయిల్ వాడినా మనకు అనారోగ్యం దరిచేరడం ఖాయం. కొవ్వు గుండెల్లో చేరుకుని గుండె జబ్బులు రావడం సహజమే. ఈ క్రమంలో మనకు రిఫైండ్ ఆయిళ్లతో గుండెపోట్ల ముప్పు పొంచి ఉందని ఆరోగ్య విశ్లేషకులు చెబుతున్నారు. గుండె జబ్బుల ప్రమాదం పొంచి ఉన్నా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు.

రోజుకు 20 గ్రాముల కొవ్వు

మన శరీరానికి డైరెక్టుగా రోజుకు 20 గ్రాముల కొవ్వు అవసరం. ఇది గింజల నుంచి లోపలకు వెళ్తుంది. కానీ నూనెలు వాడకం ద్వారా రోజుకు సగటున 60 గ్రాముల కొవ్వు లోపలకు వెళ్తుంది. దీంతో లివర్ కు నష్టం కలుగుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడంతో ఎన్నో రకాల ఇబ్బందులు ఏర్పడవచ్చు. బ్రాండ్ మార్చి ఆయిల్ కొన్నా మనకు అనారోగ్యం పంచన చేరడం ఖాయం. నూనెకు బదులు మీగడ వాడుకుంటే ఈ సమస్య రాదు. గుండెకు కొవ్వు చేరుకోవడంతో రక్తప్రసరణ సరిగా జరగక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు.