Health Tips: నేటి కాలంలో శారీరక శ్రమ కంటే కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే వారి సంఖ్య ఎక్కువగా మారుతుంది. అయితే గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం.. ఆలస్యంగా నిద్రపోవడం.. సమయానికి ఆహారం తినకపోవడం.. ఒకవేళ ఆహార పదార్థాలు తీసుకున్న అందులో ఆయిల్, జంక్ ఫుడ్ ఉండడం వల్ల చాలామంది బరువు పెరుగుతున్నారు. దీంతో డయాబెటిస్, బీపీ వంటి వ్యాధులు వస్తున్నాయి. బరువు తగ్గడానికి చాలామంది ప్రతిరోజూ వ్యాయామం చేయడానికి వెళుతుంటారు. అయినా కూడా వారిలో ఎలాంటి మార్పు ఉండదు. కానీ కేవలం వ్యాయామ మాత్రమే చేయకుండా.. కొన్ని టిప్స్ పాటించడం వల్ల మాత్రమే బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అలా చేయకపోతే ఎప్పటికీ బరువు తగ్గలేరు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
కొందరు ఏదో వాకింగ్ చేయాలని ఉద్దేశంతో ఎక్కడా పడితే అక్కడ నడుస్తూ ఉంటారు. ముఖ్యంగా సిమెంటు రోడ్లపై ఎక్కువగా నడుస్తూ ఉంటారు. అలాగే తారు రోడ్డుపై వెళ్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల బరువు తగ్గడం అటు నుంచి మోకాళ్ళ నొప్పులు పెరుగుతాయి. అందువల్ల మట్టి రోడ్డుపై లేదా పార్కుల్లో మాత్రమే నడవాలి. అలా చేయడం వల్ల కాళ్ల పాదాలకు ఒత్తిడి పెరిగి బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
చాలామంది చెప్పులు వేసుకుని వాకింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఎంత మాత్రం సేఫ్ కాదు. చెప్పులు వేసుకోవడం కాకుండా ప్రత్యేకమైన వాకింగ్ షూ వేసుకొని మాత్రమే వాకింగ్ చేయాలి. అలా చేస్తే మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. వాకింగ్ షూ వల్ల గ్రౌండ్ రియాక్షన్ మోకాళ్లపై పడకుండా ఉంటుంది.
చాలామంది బరువు తగ్గాలని ఉద్దేశంతో వాకింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఒకవైపు బరువు తగ్గాలని వాకింగ్ చేస్తూ.. మరోవైపు ఇష్టం వచ్చినట్లు తింటూ ఉంటారు. ఇలా చేస్తే సంవత్సరాలు గడిచిన కూడా వెయిట్ లాస్ అవ్వరు. ఒకవైపు వాకింగ్ చేస్తూనే మరోవైపు సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. కొవ్వు ఉండే పదార్థాలను తక్కువగా తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. బరువు తగ్గడం అనేది ఆహారం కంట్రోల్ చేయడం వల్ల 70% ఫలితం ఉంటుంది. వాకింగ్ చేయడం వల్ల 20 శాతం మాత్రమే రిజల్ట్ వస్తుంది.
వాకింగ్ చేసే సమయంలో మోకాళ్ళకు ప్రత్యేక పట్టీని ధరించడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎంత వాకింగ్ చేసినా కూడా ఇది మోకాళ్లపై ప్రభావం పడకుండా ఉంటుంది. అయితే ఈ నీ క్యాప్ కేవలం వాకింగ్ చేసేటప్పుడు మాత్రమే వాడాలి. కొందరు పడుకునే సమయంలో కూడా దీనిని వాడుతూ ఉంటారు. అలా ఎప్పటికీ చేయవద్దు.
వాకింగ్ ఒక క్రమ పద్ధతిలో చేస్తూ ఉండాలి. అంటే వారానికి 150 నిమిషాల నడక కచ్చితంగా ఉండాలి. అంటే ప్రతిరోజు ఉదయం 15 నిమిషాలు సాయంత్రం 15 నిమిషాలు అయినా నడిచే ప్రయత్నం చేయాలి. ఇక చాలామంది భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకుంటూ ఉంటారు. భోజనం చేసిన తర్వాత వెంటనే వాకింగ్ చేయడం వల్ల డయాబెటిస్ కు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల భోజనం చేసిన తర్వాత వెంటనే నడవడం మనవాడు చేసుకోండి.