Small idea big success: ఈరోజుల్లో సమస్యలు లేని జీవితం భూతద్దం పెట్టినా దొరకదు. విద్యార్థుల నుంచి వృద్దుల వరకు ప్రతి ఒక్కరూ ఏదోరకంగా ఏదో విషయంలో బాధపడుతూనే ఉంటారు. అయితే ముఖ్యంగా యువత డబ్బు కోసం ఉదయం నుంచి రాత్రి వరకు రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అయితే ఒకరిని చూసి ఒకరు డబ్బు ఎక్కువగా సంపాదించాలని అనుకుంటారు. ఈ క్రమంలో కొందరికి అదృష్టం కలిగి తొందరగా ధనవంతులుగా మారుతారు. మరికొందరు మెల్లగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక యువతి ఆవేదన చెందుతూ తాను ఇక ఎప్పటికీ డబ్బు సంపాదించలేను అని అనుకుంటుంది. అయితే ఒక రోజు తనకు వచ్చిన ఆలోచనతో ఈరోజు మిగతా వారి కంటే అత్యున్నత స్థాయికి ఎదుగుతుంది. ఇంతకీ ఆ యువతకి వచ్చిన ఆలోచన ఏంటంటే?
ఒక కార్యాలయంలో పనిచేస్తున్న యువతకి మధ్యాహ్నం ఒక సమస్య ఉంటుంది. తను రోజు మధ్యాహ్న భోజనం బయట తినలేక పోతుంది. తనకు కావలసిన రుచి లేకపోవడంతో ఒక్కోసారి మధ్యాహ్నం ఎలాంటి ఆహారం తీసుకోకుండా కడుపు ఖాళీగా ఉంచుకొనే పనిచేసేది. అయితే మధ్యాహ్నం తను ఇంట్లో ఉండి తీసుకెళ్దాం అని అనుకుంటే ఆ సమయానికి వేడి గా ఉండదు. దీంతో అలా కూడా కుదిరిది కాదు. అయితే ఒకసారి తాను తీవ్రంగా ఆలోచించింది. ఈ సమస్య నాకు మాత్రమేనా చాలామందికి ఉందా? అనుకుంది. కొందరిని సంప్రదించగా ఈ సమస్య అందరికీ ఉన్నట్లు తెలుసుకుంది. అయితే ఈ సమస్యనే పెట్టుబడిగా పెట్టాలని అనుకుంది.
Also Read: తినగానే పడుకునే వారందరికీ ఇదో షాకింగ్ న్యూస్
అయితే కొన్నాళ్ల తర్వాత తాను చేస్తున్న ఉద్యోగం మానివేసి మధ్యాహ్నం భోజనం వండి కావలసిన ఉద్యోగులకు సరఫరా చేసేది. అలా చేయడంవల్ల వారు ఇంటి భోజనం తిన్నట్లు ఫీలయ్యే వారు. దీంతో వారు ఆమె వండిన ఆహారాన్ని బాగా ఇష్టపడ్డారు. అలా కొన్ని రోజుల తర్వాత ఆర్డర్లు పెరిగాయి. ఒకప్పుడు పదుల కొద్ది ఉన్న ఆర్డర్లు ఇప్పుడు వందలకొద్దీ పెరిగాయి. అలా యువతి ఒకప్పటి కంటే ఇప్పుడు డబ్బు బాగా సంపాదిస్తుంది.
అయితే యువతకి వచ్చిన చిన్న ఆలోచన తన జీవితాన్ని మార్చేసింది. అలా ప్రతి ఒక్కరూ తన ఆలోచనలను పెట్టుబడిగా పెట్టి జీవితంలో ఎదిగే అవకాశం ఉంటుంది. అందువల్ల సమస్య వచ్చినా ప్రతి ఒక్కరూ బాధపడకుండా వాటి పరిష్కారం గురించి మాత్రమే ఆలోచించాలి. అలాగే మనుషుల అవసరాలను తీర్చే ఈ ఆలోచన ఎంతోమందికి ఉపయోగపడడమే కాకుండా అధికంగా ఆర్థికంగా అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది.