https://oktelugu.com/

ఆ రెండు లక్షణాలు కనిపిస్తే కరోనా వైరస్ సోకినట్లే..?

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభించి పది నెలలు దాటింది. కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని వార్తలు వెలువడుతున్నా వ్యాక్సిన్ రావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ప్రజలందరికీ వ్యాక్సిన్ ను పంపిణీ చేయాలంటే రెండు, మూడు సంవత్సరాలు పడుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే చెబుతుండటం గమనార్హం. Also Read: ప్రజలకు షాకింగ్ న్యూస్.. వెలుగులోకి కరోనా కొత్త లక్షణాలు..? అయితే శాస్త్రవేత్తలు కరోనా వైరస్ గురించి పరిశోధనలను కొనసాగిస్తూ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 26, 2020 / 11:31 AM IST
    Follow us on


    భారత్ లో కరోనా మహమ్మారి విజృంభించి పది నెలలు దాటింది. కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని వార్తలు వెలువడుతున్నా వ్యాక్సిన్ రావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ప్రజలందరికీ వ్యాక్సిన్ ను పంపిణీ చేయాలంటే రెండు, మూడు సంవత్సరాలు పడుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే చెబుతుండటం గమనార్హం.

    Also Read: ప్రజలకు షాకింగ్ న్యూస్.. వెలుగులోకి కరోనా కొత్త లక్షణాలు..?

    అయితే శాస్త్రవేత్తలు కరోనా వైరస్ గురించి పరిశోధనలను కొనసాగిస్తూ కొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో రుచి, వాసన కోల్పోవడంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యలు కనిపిస్తుంటే ఖచ్చితంగా కరోనా వైరస్ సోకినట్లేనని చెబుతున్నారు. ఇండియన్ హెల్త్ ఎక్స్ పర్ట్స్ కరోనా విజృంభించిన తొలినాళ్ల నుంచి ఇప్పటివరకు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు.

    Also Read: చైనాలో విజృంభిస్తోన్న కరోనా.. ఎయిర్ పోర్ట్ మూసివేత ..?

    వాసన, రుచి కోల్పోయిన వాళ్లకు నీళ్లు తీపిగా ఉప్పు మరింత ఉప్పుగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నోయిడాకు చెందిన డాక్టర్ అరుణ్‌‌ లఖన్‌‌పాల్‌‌ వాసన, రుచి లక్షణాలు కోల్పోతే కరోనా సోకిందని ఖచ్చితంగా చెప్పవచ్చని తెలిపారు. కరోనా వైరస్ రుచి, వాసన కణాలపై ప్రభావం చూపడం వల్ల ఈ విధంగా జరుగుతుందని వాళ్లు చెబుతున్నారు. రుచి, వాసన కోల్పోతే వెంటనే ఐసోలేషన్ కావాలని సూచించారు.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం:

    యువతలో ఎక్కువమంది ఈ తరహా లక్షణాలతో బాధ పడుతున్నట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే రుచి, వాసన కోల్పోయిన వారిలో కరోనా వైరస్ తీవ్ర లక్షణాలు కనిపించడం లేదని పూర్తిగా అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడిస్తున్నామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.