https://oktelugu.com/

Devotional Tips: ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం దక్కడం లేదా..? అయితే ఈ తప్పులు చేస్తున్నారేమో చూస్కోండి !

Devotional Tips: మనలో కొంతమంది దేవుని అనుగ్రహం ఉంటే మాత్రమే కోరుకున్న కోరికలు నెరవేరతాయని నమ్మకాన్ని కలిగి ఉంటారు. కొంతమంది కోరుకున్న కోరికలు నెరవేరడం కోసం ఎన్నో పూజలు చేస్తారు. పూజలు చేయడం ద్వారా కొంతమందికి అనుకూల ఫలితాలు వస్తే మరి కొందరికి మాత్రం ఎంత కష్టపడినా అనుకూల ఫలితాలు రావు. ఎన్ని పూజలు చేసినా అనుకూల ఫలితాలు రాకపోతే కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. ఒక్కో దేవునికి ఒక్కో పూజా విధానం ఉంది. దేవుళ్లను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 11, 2022 / 12:44 PM IST
    Follow us on

    Devotional Tips: మనలో కొంతమంది దేవుని అనుగ్రహం ఉంటే మాత్రమే కోరుకున్న కోరికలు నెరవేరతాయని నమ్మకాన్ని కలిగి ఉంటారు. కొంతమంది కోరుకున్న కోరికలు నెరవేరడం కోసం ఎన్నో పూజలు చేస్తారు. పూజలు చేయడం ద్వారా కొంతమందికి అనుకూల ఫలితాలు వస్తే మరి కొందరికి మాత్రం ఎంత కష్టపడినా అనుకూల ఫలితాలు రావు. ఎన్ని పూజలు చేసినా అనుకూల ఫలితాలు రాకపోతే కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి.

    ఒక్కో దేవునికి ఒక్కో పూజా విధానం ఉంది. దేవుళ్లను పూజించే సమయంలో ఆ పూజా విధానాలను పాటిస్తే మంచిది. అయితే ఎన్ని పూజలు చేసినా కార్యాలలో విజయం సాధించలేకపోతున్నామంటే మాత్రం గ్రహస్థితిని తెలుసుకోవడం చాలా ముఖ్యమని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరికీ దైవ స్థానం ఉంటుంది. వాళ్ల గ్రహస్థితులను బట్టి కూడా జీవితం ఆధారపడి ఉంటుంది. గ్రహస్థితులను తెలుసుకుని పూజలు చేయడం ద్వారా శుభ ఫలితాలు దక్కే ఛాన్స్ అయితే ఉంటుంది.

    మూలికలు, సుగంధ ద్రవ్యాలు, ఖనిజాలు తెలుసుకుని ఇబ్బందులను బట్టి యాగాలను చేయడం ద్వారా శుభఫలితాలు దక్కుతాయని చెప్పవచ్చు. దేవుడిని మనస్పూర్తిగా పూజించడం ద్వారా మనకు అనుకూల ఫలితాలు దక్కే ఛాన్స్ అయితే ఉంటుంది. పూజలు చేసే సమయంలో మనస్సులో ఇతర ఆలోచనలు ఉండకూడదు. సమస్యను బట్టి చేసే యోగాలలో మార్పులు ఉంటాయని గుర్తుంచుకోవాలి.

    త్రేష్టితా మహాయాగం చేయడం వల్ల భగవంతుని నుంచి శుభ ఫలితాలు కలిగి అవకాశాలు ఉంటాయి. దేవునికి పూజలు చేసే సమయంలో సరైన నియమనిబంధనలు పాటించడం వల్ల అనుకూల ఫలితాలు దక్కే అవకాశాలు అయితే ఉంటాయి.

    ఇవి కూడా చదవండి :

    మీ పిల్లలకు పేర్లు పెడుతున్నారా.. అస్సలు చేయకూడని తప్పులు ఇవే! 

    సోమవారం ఇలా పరమశివుడిని పూజిస్తే శని ప్రభావం నుంచి , కష్టాల నుంచి విముక్తి కలుగుతుందట ! 

    వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే ప్రమాదం!