కరోనాను ఎదుర్కోవాలంటే తీసుకోవాల్సిన పండ్లు ఇవే..?

కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజల్లో చాలామంది ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకుంటున్నారు. వైద్యులు, నిపుణులు సైతం ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహారాన్ని తీసుకోవాలని సూచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇమ్యూనిటీ బూస్టర్లు, కషాయాలకే ప్రాధాన్యం ఇవ్వడం కంటే సరైన ఆహారం తీసుకోవడం ద్వారానే కరోనా సోకకుండా మనల్ని […]

Written By: Navya, Updated On : April 29, 2021 4:20 pm
Follow us on

కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజల్లో చాలామంది ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకుంటున్నారు. వైద్యులు, నిపుణులు సైతం ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహారాన్ని తీసుకోవాలని సూచనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇమ్యూనిటీ బూస్టర్లు, కషాయాలకే ప్రాధాన్యం ఇవ్వడం కంటే సరైన ఆహారం తీసుకోవడం ద్వారానే కరోనా సోకకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ లక్ష్మయ్య ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే మంచిదని ప్రజలకు సూచిస్తున్నారు. వైరస్ సోకిన వాళ్లు, వైరస్ సోకని వాళ్లు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మంచిదని వెల్లడిస్తున్నారు.

ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవాలంటే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. డ్రైప్రూట్స్‌, నట్స్‌, పప్పు దినుసులు, చేపలు, చికెన్‌, మటన్‌, మాంసాహారం తినడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ సులభంగా పెరుగుతుంది. పాలు, పెరుగు, గుడ్లు తీసుకోవడం ద్వారా కూడా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవచ్చు. ఆంటీ యాక్సిడెంట్లు, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు పండలో పుష్కలంగా ఉంటాయి.

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆపిల్ పండ్లతో పాటు జామ పండ్లను ఎక్కువగా తీసుకుంటే మంచిది. ప్రోటీన్స్ తో కూడిన ఆహారం తీసుకోవడంతో పాటు యోగా, వ్యాయామం చేయడం ద్వారా కరోనాకు చెక్ పెట్టవచ్చు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడేవాళ్లు సాధారణ ఫిజికల్‌ ఆక్టివిటీ చేయడం ద్వారా దీర్ఘకాలిక సమస్యలను సులభంగా అధిగమించే అవకాశం ఉంటుంది.