
దేశంలో ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయే అవకాశాలు అయితే ఉంటాయి. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మాత్రమే కరోనా వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు వైరస్ సోకినా త్వరగా కోలుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
సరైన ఆహారం తినడం ద్వారా మాత్రమే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మీ ఆహారంలో కొన్ని అల్పాహారాలను చేర్చుకోవడం ద్వారా సులభంగా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకునే అవకాశం ఉంటుంది. అల్పాహారాలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బలహీనతను కూడా తొలగించుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
అల్పాహరంలో భాగంగా గుడ్లను తీసుకుంటే మంచిది. గుడ్లు ఎముకలను బలోపేతం చేయడంతో పాటు గుడ్ల ద్వారా శరీరానికి అవసరమైన కేలరీలు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫోలేట్, కాల్షియం, భాస్వరం, సెలీనియం, విటమిన్ ఎ, విటమిన్ బి 5, విటమిన్ బి 12, విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి 6 , ఇతర పోషకాలు లభిస్తాయి. సంతృప్తకర పోషకాలను గుడ్లు అందిస్తాయని చెప్పవచ్చు.
వోట్స్ కొలెస్ట్రాల్ ను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వోట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు. బచ్చలికూర రసం తాగడం ద్వారా కూడా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవచ్చు. ఫ్రీ రాడికల్స్ ను బహిష్కరించడంలో బచ్చలికూర తోడ్పడుతుంది. బ్రోకలీ ద్వారా శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. సోయాబీన్స్ తీసుకోవడం ద్వారా శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. వ్యాయామం చేయడం ద్వారా కూడా ఇమ్యూనిటీ పవర్ ను సులభంగా పెంచుకునే అవకాశాలు అయితే ఉంటాయి.