Health Tips: చాయ్‌, బిస్కెట్‌ను కలిపి తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ సమస్యలు వస్తాయట!

Health Tips: మనలో చాలామంది చాయ్‌, బిస్కెట్‌ను కలిపి తినడానికి ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. చాయ్ లో బిస్కెట్ ను ముంచుకుని తింటే బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. అయితే ఈ విధంగా తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వేధించే అలవాట్లు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. బిస్కెట్లు తినే అలవాటు ఉన్నవాళ్లు పరిమితంగా బిస్కెట్లు తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. బిస్కెట్లను ఎక్కువగా రిఫైండ్ పిండితో తయారు చేస్తారని బిస్కెట్లను […]

Written By: Navya, Updated On : March 30, 2022 1:17 pm
Follow us on

Health Tips: మనలో చాలామంది చాయ్‌, బిస్కెట్‌ను కలిపి తినడానికి ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. చాయ్ లో బిస్కెట్ ను ముంచుకుని తింటే బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. అయితే ఈ విధంగా తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వేధించే అలవాట్లు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. బిస్కెట్లు తినే అలవాటు ఉన్నవాళ్లు పరిమితంగా బిస్కెట్లు తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

Tea, Biscuits

బిస్కెట్లను ఎక్కువగా రిఫైండ్ పిండితో తయారు చేస్తారని బిస్కెట్లను ఎక్కువగా తినేవాళ్లను మలబద్ధకం సమస్య వేధించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మైదా పిండితో చేసిన వంటకాల వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని మనందరికీ తెలిసిందే. అయితే బిస్కెట్లలో ఎక్కువ బిస్కెట్లను మైదా పిండితో తయారు చేస్తారు. మైదా పిండితో తయారు చేసిన బిస్కెట్ల వల్ల తాత్కాలికంగా ఎలాంటి సమస్య లేకపోయినా భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి.

Also Read: Naga Chaitanya With Nandini Reddy: చైతుకి సమంత ప్లేస్ లో మరో హీరోయిన్ కి కావాలి

ఎక్కువ సంఖ్యలో బిస్కెట్లను తినేవాళ్లకు పంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఎవరైతే ఎక్కువగా బిస్కెట్లను తీసుకుంటారో వాళ్లు బరువు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. టీలో రుచికి తియ్యగా ఉండే బిస్కెట్లను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బిస్కెట్లలో ఉండే హైడ్రోజెనెటెడ్ ఫ్యాట్స్ శరీరానికి హాని కలిగిస్తాయి.

చాయ్, బిస్కెట్‌లను ఎక్కువ కాలం కలిపి తీసుకుంటే మాత్రం అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ అలవాటు ఉన్నవాళ్లు తమ అలవాటును మార్చుకుంటే మంచిదని చెప్పవచ్చు.

Also Read: TDP: టీడీపీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి?