New Schemes: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ఏడాది ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కేంద్రం ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఒకటి. ఈ పథకం ద్వారా కేంద్రం వైద్య కార్మికుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల వరకు పరిహారం అందిస్తోంది.
New Schemes
కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం మెంటరింగ్ యువ పథకం కూడా ఒకటి. 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న యువ రచయితల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. కల్పన, నాన్-ఫిక్షన్, మెమోయిర్స్, డ్రామా, కవిత్వం విభాగాలలో నైపుణ్యం సాధించిన వాళ్లకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. గ్రామ్ ఉజాలా పథకం పేరుతో కేంద్రం ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది.
Also Read: నిశ్శబ్ద గుండెపోటు అంటే ఏంటో తెలుసా.. లక్షణాలు ఎలా ఉంటాయంటే?
ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలకు ఎల్.ఈ.డీ బల్బులను అందిస్తోంది. ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందిస్తుండటం గమనార్హం. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో రైల్ కౌశల్ వికాస్ యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా కేంద్రం యువతకు నైపుణ్యాలను అందిస్తోంది. భారతీయ రైల్వే శిక్షణా సంస్థల ద్వారా కేంద్రం యువతకు శిక్షణ అందిస్తోంది.
పీఎం దక్ష్ యోజన స్కీమ్ ద్వారా షెడ్యూల్డ్ కులాలు, సఫాయి కార్మికులకు కేంద్రం ప్రయోజనాలను అందిస్తోంది. ఈ-శ్రమ్ పోర్టల్, పీఎం ఉమీద్ స్కీమ్, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ స్కీమ్ లను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారా.. అతి తక్కువ వడ్డీకే ఆ సంస్థ రుణాలు!