Summer Diseases: వేసవికాలంలో ఎక్కువగా వేధించే ఆరోగ్య సమస్యలు ఇవే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Summer Diseases: ప్రజలను ఒక్కో సీజన్ లో ఒక్కో తరహా వ్యాధులు వేధించే అవకాశాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. వేసవిలో వచ్చే వ్యాధుల గురించి సరైన అవగాహనను కలిగి ఉంటే వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. వేసవికాలంలో ప్రతిరోజూ కనీసం మూడు లీటర్ల నీటిని […]

Written By: Kusuma Aggunna, Updated On : March 30, 2022 4:05 pm
Follow us on

Summer Diseases: ప్రజలను ఒక్కో సీజన్ లో ఒక్కో తరహా వ్యాధులు వేధించే అవకాశాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. వేసవిలో వచ్చే వ్యాధుల గురించి సరైన అవగాహనను కలిగి ఉంటే వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశాలు అయితే ఉంటాయి.

Summer Diseases

వేసవికాలంలో ప్రతిరోజూ కనీసం మూడు లీటర్ల నీటిని తీసుకోవాలి. వేసవికాలంలో నీటిని తక్కువగా తీసుకుంటే డీ హైడ్రేషన్ సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వాటర్ పుష్కలంగా ఉండే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఈ సమస్యను సులభంగా అధిగమించే అవకాశాలు అయితే ఉంటాయి. డీహైడ్రేషన్ సమస్య వేధిస్తుంటే కొబ్బరి నీళ్లు తీసుకోవడంతో పాటు నిమ్మకాయ రసం తీసుకోవాలి. అప్పటికీ ఫలితం లేకపోతే వైద్యులను సంప్రదించాలి.

Also Read: NTR Koratala Siva Movie: ఎన్టీఆర్ షాకింగ్ నిర్ణయం.. కారణం అదే

వేసవిలో వేధించే ఆరోగ్య సమస్యలలో గవద బిళ్లలు కూడా ఒకటి కాగా ఈ వ్యాధి బారిన పడిన వాళ్లలో లాలాజాల గ్రంథులు వాచే అవకాశాలు ఉంటాయి. గవద బిళ్లలు అంటువ్యాధి కాబట్టి ఈ వ్యాధి విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటే మంచిది. వేసవిలో వడదెబ్బ, తట్టు సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎండలో ఎక్కువ సమయం తిరిగితే వడదెబ్బ బారిన పడే ఛాన్స్ ఉంటుంది.

నిమ్మరసం, గ్లూకోజ్ తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. తట్టు వ్యాధి బారిన పడితే జ్వరం, దద్దుర్లుతో పాటు ఇతర లక్షణాలు కనిపిస్తాయి. పారామిక్సోవైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఎండలో ఎక్కువగా తిరిగితే డయేరియా బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఫుడ్ పాయిజనింగ్, చికెన్ పాక్స్ కూడా వేసవిలో వేధించే ఛాన్స్ ఉంటుంది. ఈ సమస్యల బారిన పడితే వెంటనే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుని మందులు వాడాలి. వేసవిలో టైఫాయిడ్, పచ్చకామెర్లు సమస్యలు కూడా వేధించే ఛాన్స్ ఉంటుంది.

Also Read: Hero Nithin Birthday Special: హ్యాపీ బర్త్ డే నితిన్… తెలంగాణ రెండో కథానాయకుడు