IQ Power Increasing Foods: ప్రస్తుత కాలంలో పిల్లల్లో ఒకరి కంటే ఒకరు మేధాశక్తితో పోటీ పడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం చాలా డల్ గా కనిపిస్తున్నారు. అందుకు కారణం వారిలో సరైన ఆలోచన విధానం లేకపోవడమే. అంతేకాకుండా ప్రోటీన్లు లేని ఆహారం తీసుకోవడం వల్ల వారి ఆలోచన విధానం మారుతోందని కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో వారికి కావలసిన ప్రోటీన్ల ఆహారం అందించి IQ పెంచాలని తెలుపుతున్నారు. అసలు పిల్లల్లో IQ అంటే ఏమిటి? అది వారికి ఎంతవరకు అవసరం?
Intelligence Quotient(IQ) అనేది ఒక మేధాశక్తిని కొలవడానికి ఉపయోగించే స్కోర్. ఇది పిల్లల సమస్యలను పరిష్కరించి, వారి సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఐ క్యు ద్వారా పిల్లల నిజమైన వయసు తెలుసుకొనే అవకాశం ఉంటుంది. నీతో వారికి ఎటువంటి ఆహారాన్ని అందించాలి? వారితో ఎలా ప్రవర్తించాలి? అనే విషయాలను సులభంగా తెలుసుకోగలుగుతారు. సగటు ఐక్యూ స్కోర్ సాధారణంగా 100గా ఉంటుంది. 85 నుంచి 115 మధ్య స్కోర్ ఉన్నవారు సగటు మేధస్సును కలిగి ఉన్నట్లుగా పేర్కొంటారు. ఐ క్యు ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తికి ఎక్కువగా తెలివితేటలు ఉన్నట్లు గ్రహించాలి.
పిల్లల్లో ఎక్కువగా IQ పెంచడానికి వారికి సరైన ఆహారాన్ని అందించాలి. ముఖ్యంగా ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అందిస్తే వారిలో ఆలోచన శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు వారికి కోడిగుడ్డు తినిపించాలి. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే కోలిన్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పొందించడంలో గుడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. కొవ్వు కలిగిన చేపలు కూడా పిల్లలకు ఆరోగ్యాన్ని అందిస్తాయి. సాల్మన్, సార్టిన్స్ వంటి చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి మెదడు కణాల అభివృద్ధికి జ్ఞాపకశక్తికి చాలా వరకు ఉపయోగపడతాయి. అలాగే వాల్ నట్స్ లో ఒమేగా త్రీ తాటి ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. బాదం ప్రతిరోజు తినిపించాలి. ఇందులో విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది.
స్టాబెర్రీలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి మెదడుకు ఎలాంటి హాని చేయకుండా కాపాడుతాయి. కూరగాయల్లో ఆకుకూరలు, పాలకూర, మించి వంటి విటమిన్లు అధికంగా కలిగిన వాటిని తీసుకోవడం వల్ల మెదడు కణజాలం సురక్షితంగా ఉంటుంది. అలాగే ఓట్స్, గ్రౌండ్ రైస్ వంటివి మెదడుకు స్థిరమైన శక్తిని అందించి ఏకాగ్రతను పెంచుతాయి. ఇవే కాకుండా ప్రతిరోజు వ్యాయామం చేయడంతో పాటు తగినంత నీరు తాగడం.. వంటివి శారీరక శ్రమ చేయడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. దీంతో వీరిలో ఐక్యూ పవర్ పెరుగుతుంది.