Healthy foods for long life: మనం రోజు తినే ఆహారంలోనే ఆరోగ్యం ఉంటుంది. చాలామంది అనారోగ్యానికి గురి కావడానికి కలుషిత వాతావరణం లేదా స్థానిక పరిస్థితులు అని భావిస్తారు. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా వ్యాధులకు గుర అయ్యే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వ్యాధులు రావడమే కాకుండా ఆయుష్షుని తగ్గిస్తాయి. మరికొన్ని ఆహార పదార్థాలను ఆయుష్షును పెంచుతాయి. విచిత్రం ఏంటంటే ఆయుష్షును పెంచే ఆహార పదార్థాల ధరలు తక్కువగా ఉంటున్నాయి. కానీ వీటిని తక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. ఆయుష్షును తగ్గించే ఆహార పదార్థాల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. అయినా వాటిని ఎగబడి కొంటున్నారు. అసలు ఏ ఆహారం ఎంత జీవిత కాలాన్ని ఇస్తుంది? ఏమి కొంటున్నారు? ఏమి కొనడం లేదు? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది?
యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధన ప్రకారం.. ఏ ఫుడ్, ఫ్రూట్ తింటే ఎంత ఆయుష్ వస్తుందో? ఎంత ఆయుష్ కరుగుతుందో? తెలిపింది. ఈ పరిశోధన వివరాలను 2021లో నేచర్ ఫుడ్ అనే పత్రికలో ప్రచురించారు. మొత్తంగా 5800 కంటే ఎక్కువ ఆహార పదార్థాలపై అధ్యయనం చేసి.. వాటి జీవితకాల వివరాలను తెలిపారు. అయితే మన ఇండియాలో లభించే ఆహార పదార్థాలను తీసుకుంటే ఎంత ఆయుష్ తగ్గుతుందో ఇప్పుడు చూద్దాం.
యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ ప్రకారం.. పిరికెడు బాదం పప్పులను తినడం వల్ల 25 నిమిషాల ఆయుష్షు పెరుగుతుంది. ఒక అరటిపండు, ఆపిల్ తినడం వల్ల 13 నిమిషాలు, ఒక ఆరెంజ్ తినడం వల్ల ఎనిమిది నిమిషాలు, ఒక టమాట తినడం వల్ల మూడు నిమిషాల జీవితకాలం యాడ్ అవుతుంది. అదే కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల జీవితంలో కొన్ని నిమిషాలపాటు ఆయుష్షు తగ్గుతుంది. వాటిలో లార్జ్ పిజ్జా తింటే ఎనిమిది నిమిషాల జీవితం మైనస్ అవుతుంది. అలాగే బర్గర్ 9 నిమిషాలు, 250 ఎంఎల్ కూల్ డ్రింక్, సిగరెట్ 12 మినిట్స్ జీవితకాలం నుంచి వెళ్ళిపోతుంది. ఇక అన్నిటికంటే అత్యధికంగా జీవితాన్ని కోల్పోయే పదార్థాలు కూడా ఉన్నాయి. వాటిలో అమెరికాలో అయితే హాట్ డాగ్.. ఇది తినడం వల్ల 36 నిమిషాల ఆయుష్షు తగ్గుతుంది. అదే ఇండియాలో మొమోస్ తినడం వల్ల ఇంతే సమయం జీవితాన్ని కోల్పోతారు.
ఇందులో విచిత్రం ఏమిటంటే.. పిజ్జా, బర్గర్ వంటి ఆహార పదార్థాల ధరలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎగబడి కొంటారు. అదే యాపిల్స్, బనానా ధరలు తక్కువగా ఉంటాయి. ఇవి రోడ్ సైడ్ విక్రయిస్తుంటారు. వీటిని కొనడానికి ఎవరు ఆసక్తి చూపరు. అంటే మనకు తెలియకుండానే ఎక్కువ ధర పెట్టి రోగాలను కొనుక్కుంటున్నామని తెలుస్తోంది. ఎందుకంటే పిజ్జా, బర్గర్ వంటి ప్రాసెస్ ఫుడ్ తినడం వల్ల ఇప్పటికే ఎంతోమంది వ్యాధుల బారిన పడ్డారన్న విషయం తెలిసిందే.