Winter Foods: వాతావరణంతో పాటు తినే ఆహారం కలుషితం కావడంతో ఈరోజుల్లో చాలా మంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. వీటిలో ప్రధానమైనది బరువు పెరగడం. శారీరక శ్రమ లేకపోవడంతో పాటు వివిధ కారణాల వల్ల చాలా మంది లావైపోతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు వయసుతో సంబంధం లేకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుండంతో కొందరు దీని నివారణకు ప్రత్యేక మెడిసిన్ తీసుకుంటున్నారు. కానీ శాశ్వత పరిష్కారం మాత్రం కావడం లేదు. అయితే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో తిన్న ఆహారం జీర్ణమవకుండా కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలను తీసుకుంటే ఎనర్జీతో పాటు ఎలాంటి కొలెస్ట్రాల్ రాకుండా ఉంటుంది. ఇంతకీ ఆ పదార్థాలేవో చూద్దాం..
శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో శరీరం నుంచి చెమట రాకుండా శరీరంలోని కొన్ని మలిన పదార్థాలు బయటకు రాకుండా అలాగే ఉండిపోతాయి. ఇదే సమయంలో రెగ్యులర్ గా తీసుకునే ఆహారంతో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. శీతాకాలంలో కొందరు సాధారణ ఆహారం తీసుకున్నా సరైన విధంగా జీర్ణం కాదు. దీంతో అవస్థలు పడుతారు. ఇలాంటి వాళ్లు ప్రత్యేకంగా ఫుడ్ మెనునూ తయారు చేసుకోవాలి. దీని ఆధారంగా ఆహార పదార్థాలు తీసుకుంటే ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటారు.
చలికాలంలో కొలెస్ట్రాల్ రాకుండా ఎనర్జీ ఇచ్చే ఆహార పదార్థాల్లో నట్స్ ఒకటి. బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ వంటి వాటిల్లో కొవ్వు అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల అదనపు శక్తి వస్తుంది. ఇవి తినడం వల్ల ఎలాంటి కొలెస్ట్రాల్ పేరుకుపోదు.ఫలితంగా బరువు సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉండదు. చల్లటి వాతావరణంలో చాక్లెట్ కాఫీ తీసుకోవడం ఎంతో మేలు. ఇందులో ఉండే యాంటీ ఆక్సైడ్స్ కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుతాయి. ఇదే సమయంలో మంచి ఎనర్జీ ఇస్తుంది. అందువల్ల హాట్ చాక్లెట్ కాపీ తాగుతూ మధురానుభూతి పొందవచ్చు.
సినిమాకు వెళ్లిన ప్రతి ఒక్కరికి పాప్ కార్న్ తినడం ఫ్యాషన్. ఇందులో పాలిఫినాల్ వంటి పోషకాలు లభిస్తాయి. వీటిని శీతాకాలంలో ప్రత్యేకంగా తయారు చేసుకొని లేదా అందుబాటులో ఉన్న షాపు నుంచి తెచ్చుకొని తినొచ్చు. ఇవి కొన్ని తినడం వల్ల కడుపు నిండినట్లయి బరువు పెరగకుండా కాపాడుతుంది. ఫైనాపిల్ లో బ్రోమలిన్ ఎక్కువగా ఉంటుంది. స్నాక్స్ లో భాగంగా ఫైనాపిల్ ను చలికాలంలో తినడం వల్ల ఎనర్జీతో పాటు ఎలాంటి కొలెస్ట్రాల్ రాకుండా చేసుకోవచ్చు.
కొంతమందికి వేడి వేడి సూప్ తాగడం ఇష్టం. మరికొందరు ఇష్టపడరు. కానీ మాంసాహార సూప్ తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. భోజనం ముందు దీనిని తీసుకోవడం వల్ల తక్కువ ఆహారం తీసుకుంటారు. దీంతో బరువు పెరిగే అవకాశం ఉండదు. వేయించిన శెనగల వల్ల అదనపు ఎనర్జీ లభిస్తుంది. దీనిని శీతాకాలంలో స్నాక్స్ గా తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి. అంతేకాకుండా ఎనర్జీతో పాటు బరువు పెరగకుండా అడ్డుకుంటుంది. బనానా బ్రెడ్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వీటిని కూడా శీతాకాలంలో స్నాక్స్ రూపంలో తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.