White Hair: నేటి కాలంలో చాలా మంది తెల్లజుట్టుతో విపరీతంగా బాధపడుతున్నారు. వయసు చిన్నదైనా తెల్ల జుట్టు కావడంతో చాలా మంది ఆశ్చర్యంగా చూస్తున్నారు. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ కొన్ని అలవాట్లు ప్రత్యేకంగా చేసుకోవడంతోనూ తెల్లజుట్టు వస్తుందని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే తెల్లజుట్టును నల్లబరుచుకోవడానికి చాలా మంది కలర్ వేసుకుంటూ ఉన్నారు. మరికొందరు డై షాంపూలు వాడుతున్నారు. వీటి వల్ల కొత్త రోగాలను కొని తెచ్చుకోవడం తప్ప సమస్య పరిష్కారం కాదు. ఈ నేపథ్యంలో అసలు తెల్ల జుట్టు ఎలా వస్తుంది? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
నిద్రలేమి:
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి వద్ద మొబైల్ తప్పని సరిగా ఉంది. కొందరు ఉద్యోగం, వ్యాపార ఒత్తిడితో ఉంటారు. యువకులు మాత్రం సరదాగా ఫోన్ ను నిత్యం చూస్తుంటారు. దీంతో నిద్రలేమి సమస్య వస్తుంది. నిద్రలేమి కారణంగా జుట్టు త్వరగా తెల్లబడే అవకాశం ఉంది. నిద్రలేకపోతే జుట్టు ఆరోగ్యంగా ఉండదు. అందువల్ల కంటినిండా నిద్రపోయేలా చూసుకోవాలి.
మద్యపానం:
కొందరు యువకులు మద్యానికి అలవాటుపడుతారు. అల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని పోషకాలు క్షీణించిపోతాయి. దీంతో విటమిన్లు, మినరల్స్ ఎగిరిపోతాయి. ఇలా విటమిన్స్ లోపం ఏర్పడడం వల్ల జుట్టు తెల్లగా మారుతుంది. సాధ్యమైనంత వరకు మద్యపానానికి దూరంగా ఉండాలి.
ధూమపానం:
ధూమపానం ఎక్కువగా చేసేవారిలో జుట్టు తెల్లగా మారుతుంది. పొగలోని రసాయన పదార్థాలు శరీరంలోకి ప్రవేశించి జుట్టు, కళ్లకు హాని కలగజేస్తాయి. దీంతో మెలనిన్ ఉత్పత్తికి అంతరాయం కలుగుతుంది. ధూమపానం జోలికి పోకుండా ఉంటే మంచిది.
పోషకాహార లోపం:
శరీరానికి అవసరమైన ఆహారం లేకపోవడంతో రక్త ప్రసరణ సక్రమంగా ఉండదు. దీంతో అన్ని విభాగాలకు పోషకాలు వెళ్లకుండా ఉంటాయి. సాధారణంగా బి12, ఫోలిక్ యాసిడ్, సి, ఈ విటమిన్లు, జింక్ కాపర్ వంటిని లోపం కారణంగా చిన్నతనంలోనే జుట్టు తెల్లబడిపోతుంది. జుట్టు పిగ్మెంటేషన్ ను నిర్వహించడానికి పోషకాలు కీలకం. ఈ సమస్యతో బాధపడేవారు. విటమిన్ ఏ ఉండే కూరగాయలు, పసుపురంగు పండ్లు, విటమిన్ ఏ ఉండే పదార్థాలు తీసుకోవాలి.
ఒత్తిడి:
చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ ఒత్తిడితో కలిగి ఉంటున్నారు. ఇలా ఒత్తిడి కలిగిన వారిలో జుట్టు త్వరగా తెల్లబడుతుంది. వీరు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం మేలు. సంగీతం వినడం, లోతైన శ్వాస వ్యాయామాలు లాంటివి చేయడం వల్ల ఒత్తిడి నుంచి దూరంగా ఉంటారు.
పర్యావరణ కాలుష్యం:
చాలామంది వారు ఉంటున్న నివాసాల్లో పర్యావరణ లోపం ఉండడంతో జుట్టు తెల్లబడిపోతోంది. అందువల్ల పర్యావరణం సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. ఫ్యాక్టరీలు, కాలుష్యం వెదజల్లే ప్రాంతాల్లో ఉన్నవారి జుట్టు త్వరగా తెల్లబడిపోతుంది.