Teeth : అందమైన, తెల్లటి దంతాలు మీ చిరునవ్వును పెంచడమే కాకుండా మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి. కానీ, కొన్ని అలవాట్లు, ఆహారపు అలవాట్లు మీ చిరునవ్వును మసకబారేలా చేస్తాయి. దంతాల పసుపు రంగు మీ ముఖ సౌందర్యాన్ని దూరం చేయడమే కాకుండా, మీ దంతాల ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. అయితే కొన్ని ఆహారాలు, పానీయాలు దంతాలపై మరకలను వచ్చేలా చేస్తాయి. వాటిని పసుపు రంగులోకి మార్చడమే కాకుండా బలహీనంగా మారుస్తాయి. మీ దంతాలను పసుపు రంగులోకి మార్చగల 5 పదార్థాలు ఏంటో తెలుసా? వాటిని ఎందుకు తీసుకోకూడదో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
టీ, కాఫీ: టీ, కాఫీలో టానిన్లు ఉంటాయి. ఇవి దంతాలను మరక చేస్తాయి. క్రమంగా దంతాల తెల్లదనాన్ని తొలగించి పసుపు రంగులోకి మార్చుతుంది టానిన్. మీరు రోజంతా టీ లేదా కాఫీ తాగితే, దంతాల మీద దాని ప్రభావం మరింత పెరుగుతుంది. దీనిని నివారించడానికి, మీరు సిప్పర్‌ని ఉపయోగించవచ్చు. తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇక టీ, కాఫీలు దంతాలను మాత్రమే కాదు ఇతర ఆరోగ్య సమస్యలను కూడా ప్రభావితం చేస్తాయి. టీ వల్ల ప్రయోజనాలు తక్కువ అయితే నష్టాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే వీటిని మీ రొటీన్ లైఫ్ లో స్కిప్ చేయడం మంచిది అంటున్నారు నిపుణులు.
సోడా – శీతల పానీయాలు. ఇందులో అధిక మొత్తంలో యాసిడ్, చక్కెర ఉంటాయి. ఇది దంతాల బయటి ఉపరితలాన్ని బలహీనపరుస్తుంది. అంతే కాకుండా డార్క్ కలర్ కోల్డ్ డ్రింక్స్ దంతాలపై మరకలను వచ్చేలా చేస్తాయి. వీటిని నివారించడానికి, నీరు లేదా ఇతర ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం మంచిది. ఇక మద్యం వల్ల కూడా ఈ మరకలు వస్తాయి కాబట్టి వీలైనంత త్వరగా మీరు మద్యపానానికి కూడా దూరంగా ఉండాలి. దీని వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రెడ్ వైన్: ఇందులో టానిన్లు, యాసిడ్లు, డార్క్ పిగ్మెంట్లు ఉంటాయి. ఇవి దంతాల మీద శాశ్వత మరకలను వదిలివేస్తాయి. దీని అధిక వినియోగం వల్ల దంతాల మెరుపు పోతుంది. ఇక రెడ్ వైన్ మీ ఆరోగ్యానికి చాలా చేటు చేస్తుంది. దీని వల్ల నష్టాలు అనేకం. సో ప్లీజ్ స్కిప్.
మసాలా దినుసులు: పసుపు, కొత్తిమీర, చింతపండు వంటి భారతీయ మసాలా దినుసులు డార్క్ పిగ్మెంట్లను కలిగి ఉంటాయి. ఇవి దంతాల మీద మరకలు వచ్చేలా చేస్తాయి. మితిమీరిన కారంగా ఉండే ఆహారం దంతాల తెల్లదనాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, దంతాల ఉపరితలాన్ని కూడా దెబ్బతీస్తుంది.
తీపి: స్వీట్లు, చాక్లెట్లలో ఉండే చక్కెర బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. ఇది దంతాల మీద కావిటీస్, మరకలను కలిగిస్తుంది. ఎక్కువ చక్కెర తినడం వల్ల దంతాలు బలహీనంగా, పసుపు రంగులోకి మారుతాయి.