https://oktelugu.com/

Rainbow Diet : ఎన్నో ప్రయోజనాలను అందించే రెయిన్ బో డైట్ గురించి మీకు తెలుసా?

రంగు రంగుల పండ్లు కూరగాయలు ఆరోగ్యాన్ని అందంగా మారుస్తాయి. ఎందుకంటే వాటిలో ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. మొక్కలకు మంచి రంగులు ఉంటాయి. వాటి విలక్షణమైన రుచి సువాసనలను అందించే సమ్మేళనాలు కూడా ఉంటాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 19, 2024 / 11:15 PM IST

    Rainbow Diet

    Follow us on

    Rainbow Diet :  రంగులను ఎవరు ఇష్టపడరు చెప్పండి. గోడపై అందమైన శక్తివంతమైన పెయింటింగ్ మీ ఇంట్లో ఉన్నాయా? అయితే మీ ఇల్లు ఓ అందమైన బృందావనం అనుకోండి. జీవితంలో రంగులను జోడించడం ఎప్పుడు కూడా ఆశావాద దృక్పథాన్ని జోడించినట్టే అవుతుంది. మరి ఇంట్లో మాత్రమే కాదు మీ మీ భోజనంలో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. మరి ఎలా ఉపయోగించాలి అనుకుంటున్నారా? ఇక రెయిన్‌బోలు అందాన్ని చూపిస్తూ ప్రజలను విస్మయానికి గురిచేస్తుంటాయి కదా. ఫిట్‌నెస్ ప్రపంచంలో, పండ్లు, కూరగాయలలో కూడా ఓ అందమైన ఇంద్రధనస్సు దాగి ఉంది (IFYKYK). రెయిన్‌బో డైట్ అనేది ఇటీవల ప్రచారంలో ఉన్న కొత్త పదం. అయితే దీని గురించే మనం తెలుసుకుందాం.

    రంగు రంగుల పండ్లు కూరగాయలు ఆరోగ్యాన్ని అందంగా మారుస్తాయి. ఎందుకంటే వాటిలో ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. మొక్కలకు మంచి రంగులు ఉంటాయి. వాటి విలక్షణమైన రుచి సువాసనలను అందించే సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఫైటోన్యూట్రియెంట్లు మొక్క రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. వ్యాధి, అధిక ఎండ ల నుంచి మొక్కను రక్షిస్తాయి. అయితే మానవులు మొక్కల ఆహారాన్ని తిన్నప్పుడు, ఫైటోన్యూట్రియెంట్లు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మనలను కూడా రక్షిస్తాయి. ఫైటోన్యూట్రియెంట్లు శక్తివంతమైన క్యాన్సర్ వ్యతిరేక, గుండె జబ్బుల వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉంటాయి.

    మీ భోజనంలో రంగు రంగుల శ్రేణిని చేర్చడం ద్వారా, మీ ప్లేట్ సౌందర్య ఆకర్షణను మెరుగుపరచడమే కాకుండా మీ ఆహారంలో పోషక ప్రయోజనాలను కూడా పెంచిన వారు అవుతారు. ఇక ఈ రెయిన్‌బో డైట్ అనేది పండ్లు, కూరగాయలలోని వివిధ రంగులు వివిధ పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలను సూచిస్తుంది. ఈ రెయిన్ బో డైట్ లో ఎలాంటి ఆహారాలు ఉన్నాయో చూసేద్దాం.

    ఎరుపు: టొమాటోలు, స్ట్రాబెర్రీలు, రెడ్ బెల్ పెప్పర్స్ వంటి ఆహారాలలో లైకోపీన్, ఆంథోసైనిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. ఈ సమ్మేళనాలు కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి.

    పసుపు: నారింజ పసుపు క్యారెట్లు, చిలకడదుంపలలో బీటా-కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరం విటమిన్ ఎగా మారుతుంది. ఆరోగ్యకరమైన దృష్టి, చర్మం, రోగనిరోధక పనితీరును నిర్వహించడానికి కీలకం.

    ఆకుపచ్చ: బచ్చలికూర, కాలే, బ్రోకలీ వంటి ఆకుకూరలు విటమిన్లు సి, కె, ఫోలేట్, అలాగే కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలతో నిండి ఉంటాయి. ఈ ఆహారాలు ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి. వాపును తగ్గిస్తాయి.

    బ్లూ, పర్పుల్: బ్లూబెర్రీస్, వంకాయలు, ఊదా ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆంథోసైనిన్లు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

    తెలుపు: వెల్లుల్లి, ఉల్లిపాయలు, కాలీఫ్లవర్ వంటి తెలుపు, గోధుమ రంగు ఆహారాలు అల్లిసిన్, ఇతర సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో , గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పెరుగు లేదా స్మూతీకి బెర్రీలను యాడ్ చేస్తే మరింత మంచిది. మీ ఆమ్లెట్‌లో బచ్చలికూరను చేర్చడం ద్వారా కూడా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. మీ సలాడ్‌లో భాగంగా బెల్ పెప్పర్స్, క్యారెట్లు, ముల్లంగి వంటి వివిధ రకాల రంగురంగుల కూరగాయలతో ఆకు కూరలను యాడ్ చేసేయండి. క్యారెట్ స్టిక్స్, దోసకాయ ముక్కలు మొదలైన రంగురంగుల స్నాక్స్‌ను ఎంచుకోండి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..