
ఆరు రుచులలో పులుపు కూడా ఒక రుచి కాగా పుల్లగా ఉండే చింతచిగురుతో అనేక కూరలు చేస్తారనే సంగతి తెలిసిందే. అనేక వ్యాధులకు చెక్ పెట్టడంలో చింతచిగురు ఎంతగానో సహాయపడుతుంది. శరీరానికి అవసరమైన విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, టార్టారిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్ చింతచిగురు ద్వారా లభిస్తాయనే సంగతి తెలిసిందే. చింత చిగురు తినడం ద్వారా ఎముకలు దృఢంగా ఉండే అవకాశం ఉంది.
సహజ సిద్ధమైన లాక్సేటివ్ గా పని చేయడంలో చింతచిగురులో ఉండే డైటరీ ఫైబర్ ఉపయోగపడుతుంది. నులిపురుగుల సమస్యతో బాధ పడుతున్న వాళ్లు చింతచిగురు తినడం వల్ల ఆ సమస్య దూరమవుతుంది. థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టడంలో చింతచిగురు సహాయపడుతుంది. చింత చిగురును ఉడికించి నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండే చింతచిగురు మలబద్ధకం సమస్యకు చెక్ పెడుతుంది.
చింత చిగురు తినడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లతో వచ్చే జ్వరానికి చెక్ పెట్టవచ్చు. చింత చిగురు గుండెజబ్బులను తగ్గించడంతో పాటు నోటిపూతకు నివారిణిగా పని చేయడంలో దోహదపడుతుంది. కంటి సంబంధిత సమస్యలను దూరం చేయడంలో చింతచిగురు తోడ్పడుతుంది. తొలకరి ప్రారంభమయ్యే సమయంలో చింతచిగురు విరివిగా లభించే అవకాశాలు అయితే ఉంటాయి.
తీసుకునే ఆహారంలో చింతచిగురు ఉండేలా చూసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. చింత చిగురు వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంతో పాటు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది.