Mysore Bonda: ఆ వ్యాధులు ఉన్నవాళ్లు మైసూర్ బోండా తినకూడదట.. వైద్య నిపుణులు హెచ్చరిక!

Mysore Bonda: మనలో చాలామంది మైసూర్ బోండాను ఎంతో ఇష్టంగా తింటారు. రుచిగా ఉండటంతో పాటు ఉదయం సాయంత్రం సమయంలో తక్కువ ధరకే లభించే వంటకం కావడంతో మైసూర్ బోండాపై ఎక్కువమంది ఆసక్తి చూపుతారు. అయితే మైసూర్ బోండాను కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు అస్సలు తినకూడదని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. డీప్ ఫ్రై చేసిన ఈ వంటకం ఆరోగ్యానికి ఏ మాత్రం మేలు చేయదని గుర్తుంచుకోవాలి. మైసూర్ బోండా తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ […]

Written By: Navya, Updated On : March 16, 2022 5:17 pm
Follow us on

Mysore Bonda: మనలో చాలామంది మైసూర్ బోండాను ఎంతో ఇష్టంగా తింటారు. రుచిగా ఉండటంతో పాటు ఉదయం సాయంత్రం సమయంలో తక్కువ ధరకే లభించే వంటకం కావడంతో మైసూర్ బోండాపై ఎక్కువమంది ఆసక్తి చూపుతారు. అయితే మైసూర్ బోండాను కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు అస్సలు తినకూడదని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. డీప్ ఫ్రై చేసిన ఈ వంటకం ఆరోగ్యానికి ఏ మాత్రం మేలు చేయదని గుర్తుంచుకోవాలి.

Mysore Bonda

మైసూర్ బోండా తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బియ్యం పిండి, మైదా పిండి, పెరుగు సహాయంతో చేసే ఈ వంటకం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. డయాబెటిస్ తో బాధ పడేవాళ్లకు మైదాతో చేసిన వంటకాల వల్ల హాని జరుగుతుంది. గుండె సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు మైసూర్ బోండాకు దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు.

Also Read: Congress Party: ఐదు రాష్ట్రాల ఓటమి.. మొదటి పీసీసీ చీఫ్ సిద్ధూ ఔట్.. కాంగ్రెస్ ప్రక్షాళనే

మైదాలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. తరచూ మైసూర్ బోండాలు తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. మైదా పిండి ఇన్సులిన్ ను తగ్గించడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ ను కూడా తగ్గించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మైదాతో వండిన వంటకాలు తింటే ఊబకాయం వచ్చే అవకాశం అయితే ఉంటుంది.

షుగర్ తో బాధ పడేవాళ్లు మైదా తింటే ఆరోగ్యానికి ఎంతో హాని జరుగుతుంది. ఇప్పటికే మైదా పిండితో చేసిన వంటకాలను ఎక్కువగా తింటున్న వాళ్లు ఆ అలవాటును మార్చుకుంటే మంచిదని చెప్పవచ్చు.

Also Read: Pavan Kalyan: ప‌గ‌డ‌పు ఉంగ‌రం పెట్టిన ప‌వ‌న్‌.. ఇక సీఎం అవ్వ‌డం ఖాయ‌మేనా..?