Multi Vitamins: మల్టీ విటమిన్లు తీసుకుంటున్నారా? అయితే డేంజర్ లో ఉన్నట్టే..

సరైన ఆహారం, సరైన సమయానికి తీసుకోకుండా మల్టీవిటమిన్ ల వాడకాన్ని పెంచారు ప్రజలు. అధికంగా ఈ మల్టీవిటమిన్ లను తీసుకోవడం వల్ల త్వరగా మరణం సంభవించే అవకాశం ఉందని చెబుతున్నాయి సర్వేలు.

Written By: Swathi Chilukuri, Updated On : July 3, 2024 4:59 pm

Multi Vitamins

Follow us on

Multi Vitamins: శరీరానికి విటమిన్లు చాలా అవసరం. వీటి వల్ల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అంటారు నిపుణులు. విటమిన్లు తక్కువగా ఉంటే చాలా వ్యాధులు వస్తాయి. అందుకే విటమిన్లు, మినరల్స్ లభించే ఆహారాలను తీసుకోవాలి. ఈ విటమిన్‎లు మంచి ఆహారం, న్యాచురల్‎గా ప్రకృతి నుంచి అందుతాయి. ఎక్కువగా కష్టపడకుండా ఏ విటమిన్ ఎందులో లభిస్తుందో తెలుసుకొని తింటే చాలు. కానీ ఇలా చేయకపోవడం వల్ల చాలా మంది విటమిన్ డెఫీషియన్స్ తో బాధ పడతారు. ఇక వైద్యులు ఈ విటమిన్ లను క్యాప్సిల్స్ రూపంలో ఇస్తుంటారు.

సరైన ఆహారం, సరైన సమయానికి తీసుకోకుండా మల్టీవిటమిన్ ల వాడకాన్ని పెంచారు ప్రజలు. అధికంగా ఈ మల్టీవిటమిన్ లను తీసుకోవడం వల్ల త్వరగా మరణం సంభవించే అవకాశం ఉందని చెబుతున్నాయి సర్వేలు. అమెరికాకు సంబంధించిన నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు 1990 నుంచి 3 లక్షల ప్రజల మీద 20 సంవత్సరాల నుంచి ఈ అధ్యయనం చేశారు.

మల్టీ విటమిన్ ల వాడకం వల్ల ఎక్కువ కాలం జీవిస్తారు అనేది వాస్తవం కాదట. అంతేకాదు మరణించే ముప్పు కూడా ఏ మాత్రం తగ్గదు అంటున్నారు పరిశోధకులు. అంతేకాదు మల్టీవిటమిన్ లు తీసుకునే వారి కంటే తీసుకోని వారి లైఫ్ టైమ్ ఎక్కువ ఉంటుంది. అంటే వీటిని తీసుకోకపోవడమే బెటర్ అంటున్నారు నిపుణులు.

ఇలా క్యాప్సిల్స్ రూపంలో తీసుకోవడం కంటే మంచి ఆహారం తీసుకోవడం బెటర్. సూక్ష్మ, అతి సూక్ష్మ పోషకాలు, పీచు ఎక్కువగా ఉండేలా మీ ఆహారాన్ని ప్లాన్ చేసుకోండని సూచిస్తున్నారు నిపుణులు. కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి. ఈ మల్టీ విటమిన్ ల కోసం మీ ఆహారంలో కూరగాయలు, చిరుధాన్యాలు తీసుకోండి.